News January 20, 2025

కర్నూలు జిల్లా ఎస్పీగా విక్రాంత్ పాటిల్

image

కర్నూలు జిల్లా ఎస్పీ జి.బిందుమాధవ్ బదిలీ అయ్యారు. నూతన ఎస్పీగా 2012 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన విక్రాంత్ పాటిల్ నియమితులయ్యారు. ప్రస్తుతం ఆయన కాకినాడ జిల్లా ఎస్పీగా విధులు నిర్వర్తిస్తున్నారు. త్వరలో కర్నూలు జిల్లా నూతన ఎస్పీగా విక్రాంత్ బాధ్యతలు చేపట్టనున్నారు. బిందుమాధవ్ కాకినాడ ఎస్పీగా నియమితులయ్యారు.

Similar News

News February 21, 2026

కర్నూలు: ‘పరీక్షా కేంద్రాల వద్ద జిరాక్స్ సెంటర్లు మూసేయాలి’

image

కర్నూలు జిల్లాలో ఫిబ్రవరి 23 నుంచి మార్చి 24 వరకు ఇంటర్ పరీక్షలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో పరీక్షా కేంద్రాల సమీపంలోని జిరాక్స్, ఇంటర్నెట్ సెంటర్లను మూసివేయాలని ఉప కార్మిక కమిషనర్ వెంకటేశ్వర్లు ఆదేశించారు. బోర్డు నిబంధనల ప్రకారం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. నిబంధనలు ఉల్లంఘించి కేంద్రాలను తెరిచి ఉంచితే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.

News February 21, 2026

జగన్ క్షమాపణ చెప్పాలి: మంత్రి టీజీ భరత్

image

తిరుమల అంశంపై మాజీ సీఎం జగన్ భక్తులకు క్షమాపణ చెప్పాలని మంత్రి TG భరత్ డిమాండ్ చేశారు. శనివారం కర్నూలులోని వేంకటేశ్వరస్వామి ఆలయంలో కుడా ఛైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లుతో కలిసి పూజలు, మహా సంప్రోక్షణ కార్యక్రమం నిర్వహించారు. నెయ్యి కల్తీ వాస్తవమని, వైసీపీ నేతలు కౌన్సిల్‌లో చెప్పులు వేసుకుని స్వామి ఫొటోలు ప్రదర్శించడం బాధాకరమన్నారు. నిజాలు కప్పిపుచ్చేందుకే జగన్ అడ్డంగా వాదిస్తున్నారని విమర్శించారు.

News February 21, 2026

ప్రజల భాగస్వామ్యంతోనే పరిశుభ్రత: కర్నూలు కలెక్టర్

image

కర్నూలు కలెక్టరేట్ ఆవరణలో ‘స్వర్ణాంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర’ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి ప్రతిజ్ఞతో ప్రారంభించారు. ‘జీరో లిటర్ గవర్నెన్స్’ థీమ్‌తో చేపట్టిన ఈ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ.. ప్రజల భాగస్వామ్యంతోనే పరిశుభ్రత సాధ్యమని చెప్పారు. ప్రతి ఒక్కరూ ‘జీరో-వేస్ట్’ జీవనశైలి అలవర్చుకోవాలని పిలుపునిచ్చారు. అధికారులు, సిబ్బంది స్వచ్ఛత దిశగా అడుగులు వేయాలని ఆమె కోరారు.