News April 4, 2026

కర్నూలు జిల్లా ఎస్పీ హెచ్చరిక

image

కర్నూలు జిల్లా ప్రజలు ఏటీఎం కేంద్రాల వద్ద అపరిచితుల మాటలు నమ్మి డబ్బులు ఇవ్వొద్దని ఎస్పీ విక్రాంత్ పాటిల్ హెచ్చరించారు. ఇటీవల అత్యవసరం ఉందని చెప్పి డబ్బులు తీసుకొని PhonePe/Google Pay చేశామని చూపించి మోసం చేసే ఘటనలు పెరుగుతున్నాయని తెలిపారు. ఇలాంటి మోసాల్లో డబ్బులు ఖాతాలో జమ కాకపోవడం లేదా హోల్డ్‌లో పడిపోవడం వల్ల బాధితులు నష్టపోతారని చెప్పారు. అపరిచితులతో డిజిటల్ లావాదేవీలు చేయవద్దన్నారు.

Similar News

News April 20, 2026

9 మందికి కారుణ్య నియామక ఉద్యోగాలు

image

రెవెన్యూ శాఖలో కారుణ్య నియామకాల కింద 8 మందికి ఆఫీస్ సబార్డినేట్, ఒకరికి జూనియర్ అసిస్టెంట్‌గా జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి నియామక ఉత్తర్వులు అందజేశారు. సోమవారం కలెక్టరేట్‌లోని సునయన ఆడిటోరియంలో జరిగిన కార్యక్రమంలో ఆమె అభ్యర్థులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఉన్నత స్థాయికి ఎదగాలని ఆమె సూచించారు. ఈ కార్యక్రమంలో ఇన్‌చార్జి డీఆర్ఓ చిరంజీవి పాల్గొన్నారు.

News April 20, 2026

అగ్నిమాపక సిబ్బంది సేవలు అభినందనీయం: కలెక్టర్ డా.సిరి

image

ఆపద సమయాల్లో అగ్నిమాపక సిబ్బంది అందిస్తున్న సేవలు ఎంతో అభినందనీయమని కలెక్టర్ డా.సిరి కొనియాడారు. సోమవారం అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా కర్నూలు కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన పరికరాల ప్రదర్శనను ఆమె తిలకించారు. అగ్ని ప్రమాదాల నివారణకు సిబ్బంది నిరంతరం శ్రమిస్తున్నారని పేర్కొన్నారు. ప్రమాదాల పట్ల ప్రజలు అవగాహన కలిగి ఉండాలని, అప్రమత్తంగా ఉంటూ ప్రాణ ఆస్తి నష్టాలను నివారించాలని కలెక్టర్ సూచించారు.

News April 20, 2026

కర్నూలు: కాలువలో పడి 6ఏళ్ల చిన్నారి మృతి

image

కర్నూలు జిల్లా కౌతాళం మండలం కామవరం గ్రామంలో ఆరేళ్ల బాలిక రక్షిత మృతి చెందడం విషాదాన్ని నింపింది. శనివారం మధ్యాహ్నం ఇంటి నుంచి బయటకు వెళ్లిన చిన్నారి అదృశ్యం కాగా, ఆదివారం గ్రామ సమీపంలోని LLC కాలువలో మృతదేహం లభ్యమైంది. ప్రమాదవశాత్తు కాలువలో పడి ఆమె ప్రాణాలు కోల్పోయినట్లు అనుమానిస్తున్నారు. తమ గారాల పట్టి మరణంతో తల్లి నరసమ్మ, కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.