News January 23, 2025

కర్నూలు జిల్లా పోలీసులను అభినందించిన డీజీపీ

image

కర్నూలు జిల్లాలో పోలీసుల కృషి, పనితీరు అభినందనీయమని డీజీపీ ద్వారకా తిరుమలరావు అన్నారు. బుధవారం నగరంలోని వ్యాస్ ఆడిటోరియంలో డీఐజీ ప్రవీణ్ సమక్షంలో సమీక్ష నిర్వహించారు. డీజీపీ మాట్లాడుతూ.. ప్రజలకు మరుగైన సేవలు అందించాలనే లక్ష్యంతో పని చేయాలన్నారు. విజబుల్ పోలీసింగ్‌కు ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు, సైబర్ నేరాలను కట్టడి చేయాలని సూచించారు. ఎస్పీ బిందు మాధవ్ హాజరయ్యారు.

Similar News

News January 23, 2025

12వ రోజు 286 మంది అభ్యర్థుల ఎంపిక

image

ఉమ్మడి కర్నూలు జిల్లాకు సంబంధించి కానిస్టేబుల్ ఉద్యోగాల ప్రాథమిక రాత పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు కర్నూలు ఏపీఎస్పీ రెండో బెటాలియన్లో 12వ రోజు దేహదారుఢ్య పరీక్షలు ప్రశాంతంగా ముగిసినట్లు ఎస్పీ బిందుమాధవ్ తెలిపారు. 600 మంది అభ్యర్థులకు గాను 415 మంది అభ్యర్థులు హజరయ్యారన్నారు. ఫైనల్ పరీక్షకు 286 మంది అభ్యర్థులు అర్హత సాధించారని ఎస్పీ తెలిపారు.

News January 23, 2025

జాతీయ స్థాయి బీచ్ హ్యాండ్ బాల్ పోటీలకు ఆత్మకూరు క్రీడాకారులు

image

భారత ఒలింపిక్ సంఘం ఆధ్వర్యంలో ఈనెల 27 నుంచి 31 వరకు ఉత్తరాఖండ్లో జరగబోయే 38వ జాతీయ క్రీడలలో ఆంధ్రప్రదేశ్ బీచ్ హ్యాండ్ బాల్ పోటీలకు ఆత్మకూరుకు చెందిన క్రీడాకారులు శివకుమార్, రియాజ్ ఎంపికయ్యారు. ఈ మేరకు జిల్లా సంఘం కార్యదర్శి రుద్రారెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా క్రీడాకారులను టీ&టీ అధినేత జబీర్ హుస్సేన్ ప్రత్యేకంగా అభినందించి నగదు ప్రోత్సాహాన్ని అందించారు.

News January 23, 2025

నైపుణ్యాలను వెలికి తీయండి: కలెక్టర్

image

విద్యార్థుల్లో ఉన్న ప్రతిభాపాటవాలను నైపుణ్యాలను వెలికితీయాలని కలెక్టర్ పీ.రంజిత్ బాషా అన్నారు. బుధవారం కర్నూలులోని కలెక్టరేట్లోని బాలోత్సవం-2025 పోస్టర్‌ను ఆయన ఆవిష్కరించారు. ఎక్కువ మంది విద్యార్థులను భాగస్వామ్యం చేయాలని బాలోత్సవ కమిటీ నిర్వాహకులకు కలెక్టర్ సూచించారు. కార్యక్రమంలో బాలోత్సవ నిర్వహణ కమిటీ సభ్యులు డీ.ధనుంజయ, జేఎన్ శేషయ్య పాల్గొన్నారు.