News April 8, 2025
కర్నూలు జిల్లా ముఖ్యాంశాలు

➤మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి హౌస్ అరెస్ట్ ➤ వెల్దుర్తి: బొమ్మిరెడ్డిపల్లెలో టెన్షన్.. టెన్షన్..➤ కర్నూలును మెడికల్ హబ్‌గా మారుస్తాం: ఎంపీ➤ బ్రహ్మంగారు కాలజ్ఞానం రాసింది ఇక్కడే..!➤ పెద్దకడబూరు: ‘ప్రవీణ్ మృతిపై విచారణ జరపాలి’➤ కౌతాళం: తుంగభద్ర కాలువలో పడి వ్యక్తి మృతి➤ ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రేమ.. పెద్దల సమక్షంలో పెళ్లి➤ కర్నూలు: ఫీల్డ్ అసిస్టెంట్లపై రాజకీయ ఒత్తిళ్లను ఆపాలి
Similar News
News July 9, 2025
మద్దికేరలో ఆక్సిండెంట్.. ఒకరి మృతి

మద్దికేరలోని బురుజుల రోడ్డులో రెండు బైకులు ఢీకొని ఒకరు మృతి చెందారు. మృతుడిని కైరుప్పలకు చెందిన తిరుమల యాదవ్(24)గా పోలీసులు గుర్తించారు. గుంతకల్లు మండలం గుళ్లపాలెంలో భార్యను చూసి సొంతూరుకు వస్తుండగా ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై విజయ్ కుమార్ నాయక్ తెలిపారు.
News July 9, 2025
నిషేధిత పదార్థాలను విక్రయిస్తే చర్యలు తప్పవు: ఎస్పీ

జిల్లా వ్యాప్తంగా ఉన్న విద్యా సంస్ధల సమీపంలోని 100 గజాల దూరంలో సిగరెట్, పొగాకు సంబంధిత పదార్ధాలు అమ్మడం నిషేధించామని ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు. మంగళవారం జిల్లా వ్యాప్తంగా ఆపరేషన్ క్యాంపస్ సేఫ్ జోన్ స్పెషల్ డ్రైవ్ కార్యక్రమాన్ని పోలీసులు నిర్వహించారు. నిషేధిత వస్తువులను షాప్ నిర్వాహకులు అమ్మితే చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని యజమానులకు అవగాహన కల్పించారు.
News July 8, 2025
ఆదోని: సబ్ కలెక్టర్ కార్యాలయంలో ప్రజా గ్రీవెన్స్

ఆదోనిలోని సబ్ కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం సోమవారం జరిగింది. సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ ప్రజా గ్రీవెన్స్‌కు వచ్చిన ఆయా గ్రామాల ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుని వినతులు స్వీకరించారు. డీఎల్డీఓ బాలకృష్ణారెడ్డి, డీఎల్పీఓ తిమ్మక్క, డిప్యూటీ ఇన్స్‌పెక్టర్ ఆఫ్ సర్వేయర్ వేణు సూర్య, శ్రీనివాసరాజు పాల్గొన్నారు.