News March 22, 2024

కర్నూలు జిల్లా TDP MP అభ్యర్థులు వీరేనా..?

image

టీడీపీ మూడో జాబితా ఇవాళ విడుదల చేయనుంది. ఈ నేపథ్యంలో కర్నూలు ఎంపీ సీట్లు ఎవరికి కేటాయిస్తారనే ఉత్కంఠ టీడీపీ నాయకులలో నెలకొంది. కర్నూలు ఎంపీ అభ్యర్థిగా బస్తిపాడు నాగరాజు, నంద్యాల ఎంపీ అభ్యర్థిగా శబిరి పేర్లు ఉన్నట్లు సమాచారం. టీడీపీ అధికారిక ప్రకటనలో వారి పేర్లు ఉంటాయా..? లేదా ఎవరికి ఇచ్చే అవకాశం ఉందో కామెంట్ చేయండి.

Similar News

News February 8, 2026

పోలీస్ ప్రజా సమస్యల పరిష్కార వేదిక రద్దు: ఎస్పీ

image

రేపు జరగాల్సిన పోలీస్ పీజీఆర్ఎస్ కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు. అదే రోజు విజయవాడలో CM చంద్రబాబు ఆధ్వర్యంలో జరిగే ఉన్నత స్థాయి సమావేశానికి హాజరు కావాల్సి ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. దూర ప్రాంతాల నుంచి రావద్దని ప్రజలకు ఎస్పీ విజ్ఞప్తి చేశారు.

News February 8, 2026

ప్రజా గ్రీవెన్స్ రద్దు: కలెక్టర్

image

కర్నూలు కలెక్టరేట్లోని సునయన ఆడిటోరియంలో సోమవారం నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదికను రద్దు చేస్తున్నట్లు కర్నూలు కలెక్టర్ డాక్టర్ సిరి ఒక ప్రకటనలో తెలిపారు. పీజీఆర్ఎస్, రెవున్యూ క్లినిక్ రద్దు విషయాన్ని జిల్లా ప్రజలు గమనించాలని పేర్కొన్నారు. పీజీఆర్ఎస్ రద్దు కారణంగా ఎవరూ అర్జీలు ఇచ్చేందుకు కలెక్టర్ కార్యాలయానికి రాకూడదని సూచించారు.

News February 8, 2026

కర్నూలులో రెసోనెన్స్.. సీమకు జాతీయ స్థాయి విద్య

image

రెసోనెన్స్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ కర్నూలులో ఫిబ్రవరి 7(శనివారం) ప్రారంభమైంది. కార్యక్రమానికి టీ.జీ. వెంకటేశ్, పద్మశ్రీ బ్రహ్మానందం, ఎంపీ బస్తిపాటి నాగరాజు హాజరై రెసోనెన్స్ 25 ఏళ్ల అకడమిక్ సేవలను ప్రశంసించారు. రాయలసీమ విద్యార్థులకు స్థానికంగా నాణ్యమైన విద్య, నిపుణుల మార్గదర్శకత్వం, క్రమశిక్షణతో కూడిన చదువు వాతావరణం లభిస్తే JEE/NEET వంటి పోటీపరీక్షల్లో గొప్ప విజయాలు సాధిస్తారని వారు తెలిపారు.