News March 28, 2025
కర్నూలు జిల్లా TODAY TOP NEWS..!

➤ ‘కిలోకి రూ.10 కమీషన్’ నిరూపిస్తే ఆస్తులు రాసిస్తా: ఆళ్లగడ్డ ఎమ్మెల్యే
➤ ఉమ్మడి కర్నూలు జిల్లాలో నలుగురికి నామినేటెడ్ పదవులు
➤ సీ.బెళగల్ వీఆర్వోపై టీడీపీ నేత దాడి
➤ రూ.14 లక్షలు పలికిన ఒంగోలు గిత్త
➤ ఆదోని: పెట్రోల్ బంకులో చోరీ.. రూ.90 వేలు మాయం
➤ హొలగుంద మండలంలో గ్యాస్ లీక్.. ఇల్లు దగ్ధం
➤ మంత్రాలయం నేతలకు వైసీపీలో పదవులు
➤ కుట్రలకు పాల్పడినా మాదే విజయం: ఎస్వీ మోహన్ రెడ్డి
Similar News
News March 31, 2025
ఆదోనిలో సచివాలయ ఉద్యోగి సూసైడ్

ఆదోని మండలం కపటి గ్రామ సచివాలయ ఉద్యోగి మధు సూసైడ్ చేసుకున్నాడు. శ్రీనివాసనగర్ కాలనీకి చెందిన మధు (26) కపటిలో డిజిటల్ అసిస్టెంట్ గా విధులు నిర్వహిస్తున్నారు. శనివారం సాయంత్రం డ్యూటీ నుంచి వచ్చి భోజనం చేసి మేడపై గదిలో పడుకున్నాడు. ఆదివాదం ఉదయం తల్లిదండ్రులు చూడగా .. అప్పటికే ఉరివేసుకుని చనిపోయాడు. తండ్రి నారాయణరావు ఫిర్యాదుతో త్రీ టౌన్ సీఐ రామలింగయ్య కేసు నమోదు చేశామన్నారు.
News March 31, 2025
కర్నూలు జిల్లా నేటి ముఖ్యాంశాలు

➤ఒకే కుటుంబంలో ఐదు ప్రభుత్వ ఉద్యోగాలు ➤ శ్రీశైలం ఘాట్ రోడ్డులో ప్రమాదం.. ఇద్దరు మృతి➤ ఉమ్మడి కర్నూలు జిల్లాలో సీఐల బదిలీ ➤ బ్రెయిలీ భగవద్గీత రూపకర్తకు ఉగాది పురస్కారం➤ కర్నూలులో ఉగాది ఉత్సవాల్లో మంత్రి, జిల్లా కలెక్టర్ ➤ నేర ప్రవృత్తికి స్వస్తి చెప్పండి: జిల్లా ఎస్పీ➤ RU డిగ్రీ సెమిస్టర్ ఫలితాలు విడుదల➤ రాఘవేంద్ర స్వామి మఠంలో పంచాంగ శ్రవణం
News March 30, 2025
ఆర్యు డిగ్రీ సెమిస్టర్ ఫలితాలు విడుదల

రాయలసీమ యూనివర్సిటీ 1,3,5 సెమిస్టర్ డిగ్రీ ఫలితాలను ఆదివారం యూనివర్సిటీ ఇన్‌ఛార్జి ఉపకులపతి ఉమా ఆదేశాల మేరకు విడుదల చేశారు. 1వ సెమిస్టర్‌లో 7,643 మంది పరీక్ష రాయగా 3,827 మంది ఉత్తీర్ణత సాధించారు, 3వ సెమిస్టర్‌లో 6,169 మంది పరీక్ష రాయగా 3,134 ఉత్తీర్ణత సాధించారు. 5వ సెమిస్టర్ 5,709 మంది పరీక్ష రాయగా 4,097 మంది ఉత్తీర్ణత సాధించారు. వీటితోపాటు సప్లమెంటరీ పరీక్షల ఫలితాలు కూడా విడుదల చేశారు.