News June 19, 2024
కర్నూలు: టమాటా పంపిణీకి చర్యలు

కర్నూలు నగరంలోని సి.క్యాంప్ రైతుబజార్‌లో టమాటా పంపిణీకి చర్యలు తీసుకుంటున్నట్లు మార్కెటింగ్ శాఖ సహాయ సంచాలకులు నారాయణమూర్తి తెలిపారు. ప్రస్తుతం మార్కెట్‌లో టమాట కిలో ధర రూ.70 నుంచి రూ.80 వరకు ఉందన్నారు. ఈ నేపథ్యంలో మదనపల్లి నుంచి టమాట కొనుగోలు చేసి సి.క్యాంప్ రైతుబజార్‌లో వినియోగదారులకు నో లాస్ .. నో గెయిన్ కింద పంపిణీ చేయనున్నట్లు తెలిపారు.
Similar News
News October 3, 2025
ఈనెల 16న మోదీ పర్యటనను విజయవంతం చేయండి: కలెక్టర్

ఈనెల 16న ప్రధాని మోదీ జిల్లా పర్యటనను విజయవంతం చేయాలని కలెక్టర్ డా.సిరి అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లోని కాన్ఫరెన్స్ హాల్‌లో అధికారులు, పోలీసు ఉన్నతాధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. మోదీ పర్యటనలో ఎటువంటి లోపాలు లేకుండా చూడాలని కలెక్టర్ ఆదేశించారు. భద్రతా ఏర్పాట్లు, ప్రోటోకాల్, వేదిక, వసతి, ట్రాఫిక్ నియంత్రణ తదితర అంశాలపై కలెక్టర్ సమీక్షించారు.
News October 3, 2025
కర్రల సమరంలో ముగ్గురి మృతి.. స్పందించిన కర్నూలు ఎంపీ

కర్నూలు(D) హొళగుంద(M) దేవరగట్టులో జరిగిన మాళమల్లేశ్వర స్వామి బన్నీ ఉత్సవంలో ముగ్గురు భక్తులు మృతి చెందడంతో పాటు 100 మందికి పైగా గాయపడిన ఘటనపై కర్నూలు ఎంపీ నాగరాజు దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. ఘటనపై అధికారులతో మాట్లాడిన ఆయన.. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. స్వామి జైత్ర యాత్రలో భక్తులు మృతి చెందడం బాధాకరమన్నారు. ప్రభుత్వం తరఫున ఆదుకుంటామన్నారు.
News October 3, 2025
దేవరగట్టులో మూడుకు చేరిన మృతుల సంఖ్య!

దేవరగట్టు కర్రల సమరంలో జరిగిన హింసలో మరొకరు మృతిచెందారు. దీంతో మృతుల సంఖ్య మూడుకు చేరింది. ఆలూరు మండలం అరికెరకు చెందిన తిమ్మప్ప, ఆలూరుకు చెందిన నాగరాజుగా గుర్తించారు. మరో మృతుడి వివరాలు తెలియాల్సి ఉంది. 2 లక్షలకు పైగా భక్తలు పాల్గొన్న ఈ ఉత్సవంలో స్వామి, అమ్మవార్ల ఊరేగింపు సందర్భంగా ఉత్సవమూర్తుల కోసం కర్రలతో 3 గ్రామాల ప్రజలు ఒకవైపు, 11 గ్రామాల ప్రజలు మరోవైపు ఉండి కొట్టుకుంటారు.