News May 29, 2024

కర్నూలు: తుంగభద్రలో మొసలి కలకలం

image

నందవరం మండలం నాగలదిన్నె సమీపంలో తుంగభద్ర నదిలో మంగళవారం ఓ మొసలి కనిపించింది. నాలుగు రోజులుగా ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు తుంగభద్ర నదిలో నీరు ప్రవహిస్తోంది. ఎగువ నుంచి వరద నీటిలో మొసలి కొట్టుకొచ్చినట్లు స్థానికులు చెబుతున్నారు. ఆంధ్ర-తెలంగాణ సరిహద్దు ప్రాంతమైన నాగలదిన్నె వంతెనపై వెళ్తున్న ప్రజలు నది మధ్యలో తిరుగుతున్న మొసలిని చూశారు. హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని రైతులు కోరుతున్నారు.

Similar News

News October 6, 2024

చిన్న చెరువులో మృతదేహం లభ్యం

image

అవుకు రిజర్వాయర్ సమీపంలోని చిన్న చెరువులో శనివారం గుర్తుతెలియని మృతదేహం లభ్యమైనట్లు పోలీసులు వెల్లడించారు. జీఎన్ఎస్ఎస్ కాలువ ద్వారా నీటి ప్రవాహానికి మృతదేహం కొట్టుకొని వచ్చి ఉంటుందని భావిస్తున్నారు. మృతదేహం గుర్తుపట్టలేనంతగా కూళ్లిపోయి ఉందని తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.

News October 6, 2024

రేపటి నుంచి యూనివర్సిటీలకు దసరా సెలవులు

image

కర్నూలు జిల్లాలోని యూనివర్సిటీలకు దసరా సెలవులు ప్రకటించారు. రాయలసీమ, డాక్టర్ అబ్దుల్ హక్ ఉర్దూ యూనివర్సిటీలకు ఈనెల 7 నుంచి 13వ తేదీ వరకు సెలవులు ప్రకటించినట్లు ఆయా వర్సిటీల రిజిస్ట్రార్లు డాక్టర్ ఎస్.వెంకటేశ్వర్లు, ప్రొఫెసర్ వీ.లోకనాథ తెలిపారు. 14వ తేదీ తిరిగి పునఃప్రారంభమవుతాయని వారు పేర్కొన్నారు.

News October 6, 2024

రహదారులను వేగవంతంగా పూర్తి చేయండి: కలెక్టర్

image

నేషనల్ హైవే రహదారులను వేగవంతంగా పూర్తి చేయాలని కలెక్టర్ రంజిత్ బాషా సంబంధిత అధికారులను ఆదేశించారు. శనివారం నేషనల్ హైవే అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. ఎన్‌హెచ్ 40 భూ సేకరణకు సంబంధించిన నష్ట పరిహారం వెంటనే పంపిణీ చేసేవిధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఎన్‌హెచ్ 340సీకి సంబంధించి బీ.తాండ్రపాడు నుంచి గార్గేయపురం వరకు ఔటర్ రింగ్ రోడ్డు పనులను నవంబర్ 15 నాటికి పూర్తి చేయాలన్నారు.