News April 13, 2024

కర్నూలు: దున్నపోతు మాంసం కోసం యువకుల ఘర్షణ

image

జూపాడుబంగ్లా మండలంలోని మండ్లెం గ్రామంలో జరిగిన కర్రెమ్మ దేవత ఉత్సవాల సందర్భంగా దేవతకు బలి ఇచ్చిన దున్నపోతు మాంసం కోసం ఇరు వర్గాలకు చెందిన యువకులు ఘర్షణ పడ్డారు. ఈ ఘర్షణలో పదిమందికి గాయాలయ్యాయి. అందులో ఒకరు తీవ్రంగా గాయపడటంతో చికిత్స నిమిత్తం నందికొట్కూరు ఆసుపత్రికి తరలించారు. అయితే ఆసుపత్రి వద్ద కూడా యువకులు ఘర్షణ పడటంతో పోలీసులు జోక్యం చేసుకోవడంతో గొడవ సద్దుమణిగింది.

Similar News

News September 30, 2024

దసరాకు 758 ప్రత్యేక బస్సులు

image

దసరా పండుగ సందర్భంగా APSRTC కడప జోన్ పరిధిలోని కడప, అన్నమయ్య, కర్నూలు, నంద్యాల, చిత్తూరు, తిరుపతి, అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాల పరిధిలో 758 ప్రత్యేక బస్సు సర్వీసులను నడపనున్నట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. ఈ సర్వీసులు అక్టోబర్ 4వ తేదీ నుంచి ప్రారంభమవుతాయన్నారు. హైదరాబాద్, బెంగళూరు, విజయవాడ, చెన్నై, కర్నూలు, తిరుపతి, నెల్లూరు, ఒంగోలు తదితర ప్రాంతాలకు రాకపోకలు సాగిస్తాయని అధికారులు అన్నారు.

News September 30, 2024

కర్నూలు జిల్లాలో టమాటా ధర అదరహో

image

టమాటా రైతులకు కాసుల పంట పండుతోంది. కర్నూలు జిల్లాలో కిలో రూ.70 వరకు పలుకుతోంది. రైతుబజార్లలో కిలో రూ.30 నుంచి ₹44గా ఉంది. ప్రస్తుతం జిల్లాలో రోజుకు 600 టన్నుల వరకు దిగుబడి వస్తోంది. 25 కిలోల బాక్స్ ₹1400 వరకు పలుకుతోంది. పత్తికొండ, డోన్, ప్యాపిలి, ఆస్పరి, దేవనకొండ, క్రిష్ణగిరి, హొళగుంద, మద్దికెర, పెద్దకడబూరు, కల్లూరు తదితర మండలాల్లో ఈ పంటను సాగు చేశారు. జిల్లాలో సుమారు 10 వేల ఎకరాల్లో సాగులో ఉంది.

News September 30, 2024

రేపు పత్తికొండకు CM.. ఏర్పాట్లు పరిశీలించిన కలెక్టర్, ఎస్పీ

image

ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో భాగంగా పత్తికొండ మండలం పుచ్చకాయలమడ గ్రామానికి రేపు సీఎం చంద్రబాబు నాయుడు రానున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ పి.రంజిత్ బాషా, ఎస్పీ జి.బిందు మాధవ్ అడ్వాన్స్ సెక్యూరిటీ లైజన్‌లో భాగంగా ఆదివారం పుచ్చకాయలమడలో హెలిప్యాడ్, భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. సీఎం పర్యటనకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులను కలెక్టర్, ఎస్పీ ఆదేశించారు.