News December 21, 2025

కర్నూలు: నకిలీ సర్టిఫికెట్లతో ఉద్యోగాలు.. ఐదుగురి తొలగింపు

image

తెలుగు గంగ/సోమశిల ప్రాజెక్టు నిర్వాసితుల కోటాలో నకిలీ సర్టిఫికెట్లు చూపించి ప్రభుత్వ ఉద్యోగాలు పొందిన ఐదుగురిని సేవల నుంచి తొలగించారు. ఈ వ్యవహారంపై వచ్చిన ఫిర్యాదును విచారించిన ఉప లోకాయుక్త పి.రజని ఆదేశాలతో తిరుపతిలోని ఎన్టీఆర్ తెలుగు గంగ ప్రాజెక్టు చీఫ్ ఇంజినీర్ తక్షణ చర్యలు చేపట్టారు. నిబంధనల ఉల్లంఘన స్పష్టంగా తేలడంతో ఉద్యోగులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని పోలీసులకు సూచించారు.

Similar News

News December 23, 2025

రాజమండ్రి: రౌడీ షీటర్లకు ఎస్పీ ప్రత్యేక కౌన్సెలింగ్

image

రాజమండ్రి త్రీటౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో రౌడీ షీటర్లు, పాత నేరస్తులకు మంగళవారం 6 గంటల పాటు నిరంతరాయంగా తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ డి.నరసింహా కిషోర్ ప్రత్యేక కౌన్సిలింగ్ నిర్వహించారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై పీడీ యాక్ట్ నమోదు చేసి జైలుకు పంపిస్తామన్నారు. అవసరమైతే నగర బహిష్కరణ చర్యలు కూడా తీసుకుంటామని హెచ్చరించారు. ప్రతి ఒక్కరూ సత్ప్రవర్తనతో కష్టపడే తత్వాన్ని అలవర్చుకోవాలన్నారు.

News December 23, 2025

చలికాలంలో వెచ్చని ప్రదేశాలకు టూర్!

image

వింటర్ ట్రావెల్‌కు పర్ఫెక్ట్ డెస్టినేషన్ గోవా. సూర్యుని వెచ్చదనంతో ఆకర్షణీయమైన బీచ్‌లతో ఆహ్లాదకరంగా ఉంటుంది. అండమాన్ దీవులు, రాజస్థాన్‌లోని జైసల్మేర్, అలెప్పీ(కేరళ బ్యాక్‌వాటర్స్), గుజరాత్‌లోని రణ్ ఆఫ్ కచ్, పుదుచ్చేరి, కర్ణాటకలోని హంపి, బెంగాల్‌లోని మందార్‌మణి, కేరళలోని వర్కల, తమిళనాడులోని కన్యాకుమారి వింటర్‌లో పర్యటించేందుకు అనుకూలం. DEC-FEB వరకు ఈ ప్రాంతాల్లో 25-30 డిగ్రీల టెంపరేచర్లు ఉంటాయి.

News December 23, 2025

మెదక్: ‘ఇందిరమ్మ లబ్ధిదారులకు రూ.6.46 కోట్లు జమ’

image

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక పథకమైన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో జిల్లాలో వివిధ దశల్లో ఉన్న 509 మంది లబ్ధిదారులకు వారం రోజుల్లోనే రూ.6.46 కోట్లు లబ్ధిదారుల బ్యాంక్ అకౌంట్లో జమ అయినట్లు హౌసింగ్ పీడీ మాణిక్యం తెలిపారు. 4,529 మంది లబ్ది దారులకు ఇప్పటికే సుమారుగా రూ.90 కోట్ల చెల్లింపులు జరిగాయన్నారు. మెదక్ జిల్లా ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పురోగతిపై హౌసింగ్ పీడీ మాట్లాడారు.