News November 15, 2024
కర్నూలు: నదిలోకి దూకబోయిన విద్యార్థి.. కాపాడిన పోలీస్
కర్నూలు జిల్లా బండి ఆత్మకూరు మండలంలోని కుందూ నదిలో దూకబోతున్న విద్యార్థిని కానిస్టేబుల్ నాగిరెడ్డి కాపాడినట్లు ఎస్ఐ జగన్మోహన్ తెలిపారు. ఎస్‌ఐ వివరాల మేరకు.. నంద్యాల మండలం చాబోలుకి చెందిన ఓ విద్యార్థి బడికి వెళ్లడం లేదని తల్లిదండ్రులు మందలించారు. దీంతో మనస్తాపం చెందిన విద్యార్థి ఆత్మహత్యకు యత్నించగా కానిస్టేబుల్ నాగిరెడ్డి గమనించి కాపాడారు. తల్లిదండ్రులను పిలిపించి కౌన్సెలింగ్ ఇచ్చి పంపించారు.
Similar News
News November 15, 2024
అల్పపీడనం.. కర్నూలు, నంద్యాల జిల్లాల్లో వర్షాలు
బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో శుక్రవారం కర్నూలు, నంద్యాల జిల్లాలో వర్షాలు కురిసే అవకాశముందని విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. కాగా ఇది పంట చేతికి వచ్చే సమయం కావడంతో వర్షం సూచనలు రైతులను బెంబెలేత్తిస్తున్నాయి. ఆరుగాలం పండించిన పంట నీటి పాలవుతుందేమోనని భయాందోళనకు గురువుతున్నారు. పంటను కాపాడుకునేందుకు అవస్థలు పడుతున్నారు.
News November 15, 2024
వెలుగోడు: చంద్రబాబుతోనే మైనార్టీల సంక్షేమం సాధ్యం: మౌలానా ముస్తాక్
రాష్ట్రంలో సీఎం చంద్రబాబు పాలనలతోనే మైనార్టీల సంక్షేమం సాధ్యపడుతుందని రాష్ట్ర మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్‌గా నియమితులైన మౌలానా ముస్తాక్ అహ్మద్ పేర్కొన్నారు. ఈ మేరకు గురువారం వెలుగోడు పట్టణంలోని అరబిక్ కళాశాలను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. టీడీపీలో పనిచేసే ప్రతి కార్యకర్తకు తప్పనిసరిగా గుర్తింపు ఉంటుందని, అందుకు తానే చక్కటి ఉదాహరణ అని వెల్లడించారు.
News November 14, 2024
ఆదోని: పోసాని కృష్ణ మురళిపై ఫిర్యాదు
ఆదోని పట్టణంలోని మూడవ పట్టణ పోలీస్ స్టేషన్లో పోసాని కృష్ణ మురళిపై జనసేన నాయకులు ఫిర్యాదు చేశారు. వైసీపీ హయాంలో పవన్ కళ్యాణ్‌పై పోసాని అనుచిత వ్యాఖ్యలు చేశారని జనసేన పట్టణ అధ్యక్షుడు ఫిర్యాదులో పేర్కొన్నారు. అదే విధంగా పత్తికొండలో టీడీపీ నాయకులు పోసానిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.