News April 25, 2024

కర్నూలు: నిరుద్యోగి నామినేషన్ దాఖలు

image

కర్నూలు జిల్లా ఆస్పరికి చెందిన బోయ రంగస్వామి అనే నిరుద్యోగి బుధవారం ఇండిపెండెంట్‌గా నామినేషన్ దాఖలు చేశారు. తహశీల్దార్ కార్యాలయంలో రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు సమర్పించారు. రంగస్వామి మాట్లాడుతూ.. పాలక, ప్రతిపక్ష పార్టీలు అవలంబిస్తున్న నిరుద్యోగ విధానాలకు వ్యతిరేకంగా యువత నడుం బిగించాలనే ఉద్దేశంతో నామినేషన్ వేసినట్లు తెలిపారు. యువత మేలుకోవాలని, భవిష్యత్తును మనమే మార్చుకోవాలని అన్నారు.

Similar News

News April 23, 2025

కర్నూలులో 43.5°C ఉష్ణోగ్రత

image

కర్నూలు జిల్లాలో ఎండలు మండిపోతున్నాయి. సూర్యప్రతాపానికి ప్రజలు విలవిల్లాడుతున్నారు. మంగళవారం కర్నూలులో 43.5°C ఉష్ణోగ్రత నమోదైంది. ఈ సీజన్‌లో ఇదే అత్యధికం. ఉదయం 9 గంటలకే వాతావరణం వేడెక్కుతుండటంతో ఇళ్ల నుంచి బయటకు రావాలంటేనే జనం జంకుతున్నారు. మరోవైపు భగ్గుమంటున్న ఎండల వేళ శరీరం డీహైడ్రేషన్‌కు గురికాకుండా పండ్ల రసాలు, కొబ్బరినీళ్లు తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.

News April 23, 2025

నేడే రిజల్ట్.. కర్నూలు జిల్లా విద్యార్థుల ఎదురుచూపు

image

పదో తరగతి పరీక్షల ఫలితాల విడుదలకు సర్వం సిద్ధమైంది. నేడు ఉదయం 10 గంటలకు మంత్రి నారా లోకేశ్ ఫలితాలను విడుదల చేయనున్నారు. కర్నూలు జిల్లాలో 40,776 మంది విద్యార్థులు ఉన్నారు. మార్చి 17 నుంచి ఏప్రిల్ 1 వరకు పరీక్షలు జరిగిన విషయం తెలిసిందే.
☞ వే2న్యూస్ యాప్‌లోనూ ఫలితాలు చెక్ చేసుకోవచ్చు.

News April 23, 2025

ఉపాధి పనులపై కర్నూలు కలెక్టర్ కీలక ఆదేశాలు

image

వేసవిలో ముమ్మరంగా ఉపాధి పనులు కల్పించాలని జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా ఎంపీడీవోలను ఆదేశించారు. ఏప్రిల్, మే, జూన్ నెలల్లో 90 శాతం లక్ష్యాన్ని సాధించేలా కృషి చేయాలని చెప్పారు. మంగళవారం ఉపాధి హామీ, హౌసింగ్, గ్రామ, వార్డు సచివాలయాల సేవల అంశాలపై జిల్లా అధికారులు, మండల స్పెషల్ అధికారులతో కలెక్టర్ ఫోన్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇళ్ల నిర్మాణాలను వేగవంతంగా పూర్తి చేయాలని ఆదేశించారు.

error: Content is protected !!