News December 29, 2025
కర్నూలు: ‘నిరుద్యోగులు పేర్లు నమోదు చేసుకోవాలి’

పదో తరగతి, ఇంటర్, డిగ్రీ అర్హత కలిగిన నిరుద్యోగ యువత www.ncs.gov.in వెబ్‌సైట్‌లో పేర్లు నమోదు చేసుకోవాలని జిల్లా ఉపాధి కల్పనాధికారిణి దీప్తి సూచించారు. మొబైల్ నంబర్, ఆధార్, మెయిల్ ఐడీతో రిజిస్ట్రేషన్ చేసుకుంటే ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం, కెరీర్ మార్గదర్శనం, జాబ్ మేళాల వివరాలు తెలుసుకోవచ్చన్నారు. సందేహాలుంటే జిల్లా ఉపాధి కార్యాలయాన్ని సంప్రదించాలని కోరారు. యువత సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు.
Similar News
News February 18, 2026
బాల్య వివాహాలు జరగకుండా చూడాలి: కలెక్టర్

కల్లూరు మండలం బస్తిపాడులోని గ్రామ సచివాలయంలో కలెక్టర్ ఏ.సిరి మండల సమాఖ్య పొదుపు సంఘాలతో సమావేశం నిర్వహించారు. పొదుపు సంఘాల మహిళలతో ఆమె మాట్లాడారు. గ్రామంలో బాల్య వివాహాలు చేస్తున్నారనే సమాచారం వస్తే వెంటనే సంబంధిత అధికారులకు సమాచారం చేరవేసి, వాటిని ఆపాలన్నారు. చదువురాని వారు అక్షరాంధ్రలో ఎన్‌రోల్‌మెంట్ అవ్వాలని, చదువు వస్తే గౌరవం వస్తుందని తెలిపారు.
News February 18, 2026
కర్నూలు: మెడికల్ విద్యార్థిని సూసైడ్

గూడూరు(M) పెంచికలపాడు సమీపంలోని విశ్వభారతి మెడికల్ కాలేజీ విద్యార్థిని సోనిక(22) సూసైడ్ చేసుకుంది. ప్రకాశం(D) తుర్లపాడుకు చెందిన రత్నమయ్య కుమార్తె సోనిక పారామెడికల్ అనస్థీషియా మొదటి సంవత్సరం చదువుతోంది. తల్లిదండ్రుల మధ్య విభేదాల కారణంగా ఆమె కొంతకాలంగా మనస్తాపంతో ఉండేది. ఈ క్రమంలో మంగళవారం హాస్టల్ రూములో ఉరేసుకుంది. ఈ ఘటనపై కె.నాగలాపురం ఎస్ఐ అఖిల్ కుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
News February 18, 2026
కర్నూలు: హోలీ పండుగ సందర్భంగా ప్రత్యేక రైళ్లు

హోలీ పండుగ సందర్భంగా రైల్వే శాఖ తిరుపతి-రాక్సౌల్ మధ్య ప్రత్యేక రైళ్లు నడుపుతోంది. ఈనెల 21, 28న, మార్చి 7న తిరుపతి నుంచి ఉదయం 8.15 గంటలకు రైలు(07051) బయలుదేరి రెండో రోజు మధ్యాహ్నం 1.30 గంటలకు రాక్సౌల్ చేరుకుంటుంది. తిరిగి ఈనెల 24న, మార్చి 3, 10న ఉదయం 8.30 గంటలకు రాక్సౌల్ నుంచి బయలుదేరి రెండో రోజు సాయంత్రం 6.30 గంటలకు తిరుపతికి చేరుకుంటుంది. ఈ రైళ్లు గుంతకల్లు, ఆదోని, మంత్రాలయం మీదుగా నడుస్తాయి.


