News April 21, 2024

కర్నూలు: నేడు ఆదర్శ పాఠశాలలకు ప్రవేశ పరీక్ష

image

కర్నూలు జిల్లాలోని ఆదర్శ పాఠశాలలో 6వ తరగతి ప్రవేశాలకు నేడు పరీక్ష నిర్వహిస్తున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి శ్యామూల్ తెలిపారు. ఉదయం 10గంటల నుంచి 12గంటల వరకు నిర్వహిస్తున్నామన్నారు. వెబ్ సైటు నుంచి హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకొని పరీక్షలకు హాజరుకావాలన్నారు. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు హాల్ టికెట్, బ్లూ, బ్లాక్ పెను, పరీక్ష ప్యాడ్ తో ఉదయం 9 గంటలకు పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలన్నారు.

Similar News

News September 30, 2025

దేవరగట్టు బన్నీ ఉత్సవాలకు ప్రతిష్ఠ బందోబస్తు: ఎస్పీ

image

దసరా పండుగను పురస్కరించుకుని వచ్చే నెల 2న (గురువారం) దేవరగట్టు శ్రీ మాళమల్లేశ్వర స్వామి బన్నీ ఉత్సవం శాంతియుతంగా, ఆచార సంప్రదాయాలకు అనుగుణంగా జరగాలని కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్ విజ్ఞప్తి చేశారు. భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టం చేశామన్నారు. బన్నీ ఉత్సవం సందర్భంగా ఏవైనా అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా 800 మంది పోలీసులతో పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశామని వెల్లడించారు.

News September 30, 2025

కల్లూరు: కారు ఢీకొని 33 గొర్రెలు, కాపరి మృతి

image

కర్నూలు జిల్లా కల్లూరు మండలం బస్తిపాడు గ్రామానికి చెందిన కురువ ఎల్ల రాముడు (33) కారు ఢీకొని మృతి చెందాడు. ఉలిందకొండ నేషనల్ హైవేలో గొర్రెలను రోడ్డు దాటిస్తుండగా కర్నూల్ నుంచి వేగంగా వస్తున్న కారు గొర్రెల మందపైకి దూసుకెళ్లింది. 33 గొర్రెలతో సహా కాపరి అక్కడికక్కడే మృతి చెందారు. మృతుడికి నలుగురు ఆడపిల్లలు ఉన్నట్లు స్థానికులు తెలిపారు.

News September 30, 2025

జోగుళాంబ అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పణ

image

దసరా శరన్నవరాత్రి ఉత్సవాల వేళ ఏపీ తరఫున జిల్లా కలెక్టర్‌ డా.ఏ.సిరి జోగుళాంబా సమేత శ్రీ బాలబ్రహ్మేశ్వర స్వామి, అమ్మవారికి పట్టువస్త్రాలను సమర్పించారు. ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించగా, కలెక్టర్‌ దంపతులు అమ్మవారిని దర్శించుకున్నారు. పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ప్రతి సంవత్సరం రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు సమర్పించడం ఆనవాయితీగా కొనసాగుతోంది.