News March 29, 2024

కర్నూలు: నేడు CM, మాజీ CM పర్యటన

image

ఉమ్మడి కర్నూలు జిల్లాలో CM, మాజీ CM ఇవాళ పర్యటించనున్నారు. బనగానపల్లెలో TDP అధినేత చంద్రబాబు ‘ప్రజాగళం’ కార్యక్రమంలో భాగంగా స్థానిక పెట్రోల్ బంక్ వద్ద నిర్వహించే రోడ్ షోలో ఆయన పాల్గొననున్నారు. అనంతరం బహిరంగ సభలో CBN ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. అలాగే మరో వైపు సీఎం జగన్ ఎమ్మిగనూరు వైడబ్ల్యూసీఎస్ మైదానంలో సాయంత్రం ‘మేమంతా సిద్ధం’ బస్సుయాత్రలో పాల్గొంటున్నారు.

Similar News

News September 19, 2025

ఆదోని వ్యవసాయ మార్కెట్లో పత్తి ధర పతనం

image

ఆదోని వ్యవసాయ మార్కెట్ యార్డులో గురువారం పత్తి ధరలు పడిపోయాయి. పత్తి గరిష్ఠంగా క్వింటాం రూ.7,665, కనిష్ఠంగా రూ.7389 పలికింది. వేరుశనగ గరిష్ఠ ధర రూ.4,568, కనిష్ఠ ధర రూ.4,093, ఆముదం గనిష్ఠ ధర రూ.6,070 పలికినట్లు వ్యవసాయ అధికారులు తెలిపారు. రైతులు మాత్రం పత్తి ధర రోజురోజుకూ పతనమవుతుందని ఆందోళన చెందుతున్నారు. గతంలో రూ.8-12 వేల వరకు పత్తిని కొనుగోలు చేసేవారని అన్నారు.

News September 18, 2025

చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు: ఎస్పీ

image

చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు. గురువారం జిల్లాలో వాహనాల తనిఖీ చేపట్టారు. అనుమానాస్పద వ్యక్తులను మొబైల్ సెక్యూరిటీ డివైజులతో వేలిముద్ర సేకరించారు. నేరాల కట్టడిపై నిఘా, రోడ్ సేఫ్టీ నియమాలపై ప్రజలకు అవగాహన కల్పించినట్లు తెలిపారు. ఏదైనా సమస్య వస్తే స్థానిక పోలీస్ స్టేషన్‌లో గాని, డయల్ 100కు గాని ఫిర్యాదు చేయాలన్నారు.

News September 17, 2025

స్త్రీల ఆరోగ్యమే కుటుంబ బలానికి ఆధారం: నవ్య

image

కర్నూలు పట్టణ ఆరోగ్య కేంద్రంలో నిర్వహించిన స్వస్థ్ నారీ-సశక్త్ పరివార్ అభియాన్, పోషణ్ మాహ్ కార్యక్రమాల్లో బుధవారం ఇన్‌ఛార్జ్ కలెక్టర్ డా.బి.నవ్య పాల్గొన్నారు. మహిళల ఆరోగ్యం పరిరక్షణతో కుటుంబ బలోపేతం సాధ్యమవుతుందని ఆమె పేర్కొన్నారు. సమతుల్య ఆహారం, యోగా, స్క్రీనింగ్ టెస్టులపై అవగాహన కల్పించారు. గర్భిణులకు శ్రీమంతం, పిల్లలకు అన్నప్రాశనం చేశారు.