News April 13, 2025
కర్నూలు: పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెస్సల్ సిస్టం కార్యక్రమం రద్దు

డా.బిఆర్ అంబేడ్కర్ జయంతి సందర్భంగా సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెస్సల్ సిస్టం రద్దు చేస్తున్నట్లు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదివారం తెలిపారు. కావున అర్జీదారులు సుదూర ప్రాంతాల నుంచి వ్యయ, ప్రయాసలతో జిల్లా ఎస్పీ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమానికి రావొద్దని తెలిపారు. జిల్లా ప్రజలు విషయాన్ని గమనించాలన్నారు.
Similar News
News April 15, 2025
నంద్యాల జిల్లాలో ఇద్దరు దొంగల అరెస్ట్

నంద్యాలలో కొన్ని నెలలుగా చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు దొంగలను అరెస్టు చేసినట్లు జిల్లా ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా తెలిపారు. మద్దికేర గ్రామానికి చెందిన దూదేకుల షాహిద్, పందిపాడు గ్రామానికి చెందిన దూదేకుల దస్తగిరిని సోమవారం అరెస్టు చేసి వారి నుంచి బంగారం, నగదును స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. ఒంటరి మహిళలే టార్గెట్‌గా దొంగతనాలకు పాల్పడ్డారని పేర్కొన్నారు.
News April 15, 2025
ఆళ్లగడ్డలో టీడీపీ నేతపై దుండగుల దాడి

ఆళ్లగడ్డలో టీడీపీ నేత సింగం భరత్ రెడ్డిపై దుండగులు దాడికి పాల్పడ్డారు. నాలుగు రోడ్ల సెంటర్‌లో కర్రలతో కిరాతకంగా కొట్టడంతో తలకు తీవ్రగాయాలు అయ్యాయి. కుటుంబ సభ్యులు పట్టణంలోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం నంద్యాలకు తీసుకెళ్లారు. గేటు వసూళ్ల విషయంలో ఈ దాడి జరిగినట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
News April 15, 2025
కర్నూలులో మెరుగైన వైద్యం అందిచాలి: మంత్రి భరత్

కర్నూలు సర్వజన ఆస్పత్రిలో రోగులకు మెరుగైన వైద్యంతోపాటు, సౌకర్యాలు కూడా కల్పించాలని రాష్ట్ర పరిశ్రమల శాఖా మంత్రి టీజీ భరత్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్‌లో హాస్పిటల్ డెవలప్మెంట్ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా, ఎంపీ బస్తిపాటి నాగరాజు, ఎమ్మెల్యేలు గౌరు చరిత, దస్తగిరిలు హాజరయ్యారు. అభివృద్ధి పనులను త్వరగా పూర్తి చేయాలని అన్నారు.