News March 19, 2024
కర్నూలు : పరీక్ష రాస్తున్న విద్యార్థినికి అస్వస్థత

పెద్దకడబూరు మండల కేంద్రంలోని మోడల్ స్కూల్‌లో పదో తరగతి పరీక్షలకు హాజరైన సింధు అనే విద్యార్థిని అస్వస్థతకు గురైన ఘటన మంగళవారం జరిగింది. పరీక్ష హాల్లో అస్వస్థతకు గురై ఒక్కసారిగా కుప్పకూలడంతో అధికారులు, ఎస్‌ఐ మహేశ్ కుమార్ ఆధ్వర్యంలో స్థానిక పీహెచ్సీకి తీసుకెళ్లారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం అంబులెన్స్‌లో ఆదోని ఏరియా ఆసుపత్రికి తరలించారు.
Similar News
News April 2, 2025
రేపు కర్నూలుకు YS జగన్ రాక.!

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రేపు కర్నూలుకు రానున్నారు. ఉదయం 9:30కు తాడేపల్లి నివాసం నుంచి బయలు దేరి 11:45కు కర్నూలుకు చేరుకుంటారు. అనంతరం కర్నూలు GRC కన్వెన్షన్ హాల్లో జరిగే కోడుమూరు నియోజకవర్గ సమన్వయకర్త కోట్ల హర్షవర్ధన్‌రెడ్డి కూతురి వివాహా కార్యక్రమంలో పాల్గొంటారని పార్టీ కార్యాలయం తెలిపింది. దీంతో జగన్ రాకకు జిల్లా వైసీపీ నాయకులు ఏర్పాట్లను పూర్తి చేశారు.
News April 2, 2025
కర్నూలు: నేటి నుంచి JEE మెయిన్స్.. ఇవి పాటించాలి.!

కర్నూలు జిల్లా వ్యాప్తంగా ఏప్రిల్ 2 నుంచి 8వ తేదీ వరకు JEE మెయిన్స్ పరీక్షలు జరుగుతున్నాయి. కాగా.. పరీక్షను హజరయ్యేవారు కింది విషయాలు తప్పక పాటించాలని అధికారులు తెలిపారు.
➤పరీక్షా కేంద్రానికి 30 నిమూషాల ముందే రావాలి.
➤పేపర్-1 పరీక్ష ఉదయం 9 నుంచి మధ్యహ్నం 12 వరకు.
➤2వ పేపర్ మధ్యహ్నం 3 నుంచి సాయంత్రం 6 వరకు.
➤ఉదయం పరీక్షకు 7గంటలకు, మధ్యహ్నం పరీక్షకు 1గంటకు పరీక్షా కేంద్రానికి చేరుకోవాలన్నారు.
News April 2, 2025
కర్నూలు జిల్లాకు వర్ష సూచన

కర్నూలు జిల్లా వ్యాప్తంగా శుక్రవారం ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు వర్షాలు పడతాయని వాతావరణ శాఖ (APSDMA) పేర్కొంది. కాబట్టి రైతులు, కూలీలు, జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది. అంతే కాకుండా వర్షాలు పడే సమయంలో, రైతులు పొలాల్లోని చెట్ల కింద ఉండరాదని, వాతావరణంలో మార్పులు రాగానే ఇళ్లకు చేరుకోవాలని తెలిపింది.