News November 3, 2025

కర్నూలు పవర్ ప్రాజెక్టుకు ₹7500 కోట్ల REC ఫండింగ్

image

AP: బ్రూక్‌ఫీల్డ్ క్లీన్ ఎనర్జీ సంస్థ ‘ఎవ్రెన్’ కర్నూలు జిల్లాలో ఏర్పాటుచేసే పవర్ ప్రాజెక్టుకు కేంద్ర సంస్థ REC ₹7500 కోట్లు అందించనుంది. ప్రైవేటు ప్రాజెక్టులో ఆర్ఈసీ అందించే అతిపెద్ద ఫండింగ్ ఇదే. 1.4 GW హైబ్రిడ్ ప్రాజెక్టుకు బ్రూక్‌ఫీల్డ్ ₹9910 కోట్లు వ్యయం చేయనుంది. ఎవ్రెన్ సంస్థలో 51.49% వాటా ఉన్న ఆ సంస్థ ఏపీలో మొత్తంగా 3 WG పవర్ ప్రాజెక్టుకు వీలుగా ప్రణాళికలు సిద్ధం చేసింది.

Similar News

News November 3, 2025

రేపు పిడుగులతో వర్షాలు: APSDMA

image

AP: రేపు పలు జిల్లాలకు APSDMA వర్షసూచన చేసింది. కోనసీమ, తూ.గో., ప.గో., కృష్ణా, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, అనంతపురం, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పింది. మిగతా జిల్లాల్లో తేలికపాటి వానలు పడే ఛాన్స్ ఉన్నట్లు పేర్కొంది. అకస్మాత్తుగా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసేటప్పుడు చెట్ల కింద నిలబడరాదని సూచించింది.

News November 3, 2025

Photo: అప్పుడు ధోనీ.. ఇప్పుడు హర్మన్

image

భారత మహిళా జట్టు తొలిసారి <<18182320>>ప్రపంచకప్<<>> గెలిచి దశాబ్దాల నాటి కలను సాకారం చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ముంబైలోని ఐకానిక్ గేట్ వే ఆఫ్ ఇండియా వద్ద ట్రోఫీతో కెప్టెన్ హర్మన్ ప్రీత్ ఫొటోలకు పోజులిచ్చారు. 2011 నాటి ధోనీ పోజ్‌ను రీక్రియేట్ చేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను ICC ట్వీట్ చేసింది. అంతకుముందు ‘క్రికెట్ అందరి గేమ్’ అని రాసిన టీషర్ట్‌ ధరించి, కప్‌తో నిద్రిస్తున్న ఫొటోను హర్మన్ షేర్ చేశారు.

News November 3, 2025

ఆన్‌లైన్‌లో గేమ్స్ ఆడి అప్పుల పాలు.. కానిస్టేబుల్ ఆత్మహత్య!

image

TG: పోలీస్ కానిస్టేబుల్ గన్‌తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన సంగారెడ్డిలో జరిగింది. కల్హేర్‌కు చెందిన సందీప్ ఏడాదికాలంగా పట్టణ PSలో పనిచేస్తున్నారు. ఈరోజు మహబూబ్‌సాగర్ చెరువు కట్టపై రివాల్వర్‌తో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆయన ఆన్‌లైన్‌ గేమ్స్‌లో డబ్బులు పోగొట్టుకున్నారని, సహోద్యోగుల వద్ద అప్పులు చేశారని సమాచారం. డబ్బులు తిరిగివ్వాలని ఒత్తిడి చేయడంతో సూసైడ్ చేసుకున్నట్లు తెలుస్తోంది.