News March 22, 2024
కర్నూలు : పాలీసెట్‌కు దరఖాస్తుల ఆహ్వానం

పాలిటెక్నిక్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్‌కు ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు ప్రభుత్వ మైనారిటీ పాలిటెక్నిక్ కాలేజీ ప్రిన్సిపాల్ ఎ.చక్రవర్తి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఓసీ, బీసీ విద్యార్థులు రూ. 400, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు రూ.100 ఫీజు చెల్లించి https://polycetap. nic.in ద్వారా వచ్చే నెల 5వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు. పదో తరగతి పరీక్షలో ఉత్తీర్ణులైన వారు అర్హులన్నారు.
Similar News
News February 20, 2026
పరిహారం త్వరితగతిన మంజూరు చేయాలి: జేసీ

కర్నూలు కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాలులో ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం అమలుకు సంబంధించి జిల్లా విజిలెన్స్ & మానిటరింగ్ కమిటీ సమావేశం జేసీ నూరుల్ ఖమర్ నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం పకడ్బందీగా అమలు చేయాలన్నారు. బాధిత కుటుంబాలకు ఉపాధి, ఇంటి స్థలం, అర్హత కలిగిన ఇతర ప్రయోజనాలను త్వరితగతిన మంజూరు చేయాలని అధికారులను ఆదేశించారు.
News February 20, 2026
కర్నూలు: రెండు వారాల్లో పెళ్లి.. అంతలోనే విషాదం

కర్నూలు(D) గోనెగండ్ల మండలం ఐరన్ బండకు చెందిన టీడీపీ కార్యకర్త, ఉపాధి హామీ పథకం ఫీల్డ్ అసిస్టెంట్ బోయ నీలకంఠ(30) నిన్న రాత్రి అనారోగ్యంతో మృతి చెందారు. ఈయనకు ఇటీవలే నిశ్చితార్థం అయింది. మార్చి 5, 6వ తేదీలలో వివాహం జరగాల్సి ఉండగా ఈ ఘటనతో ఇరు కుటుంబాలు కన్నీరు మున్నీరయ్యాయి. నీలకంఠ మృతి పట్ల టీడీపీ మండల నాయకులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
News February 20, 2026
నంద్యాల: గుండెపోటుతో కోవా బన్ను వ్యాపారి మృతి

నంద్యాల(D) ఆత్మకూరుకు చెందిన కోవా బన్ను వ్యాపారి షేక్ బాషా నిన్న గుండెపోటుతో మృతిచెందారు. మేడారం జాతర సందర్భంగా ఓ యూట్యూబ్ ఛానల్ చూపిన అత్యుత్సాహంతో అతని వ్యాపారం పడిపోయింది. ఈ వ్యాపారం కోసం ప్రత్యేకంగా గేదెలు, ఆటో కొనుగోలు చేయడంతో పాటు సుహానా-సమయ మిల్క్ డెయిరీ పేరుతో పాల ఉత్పత్తి చేసేవారు. వ్యాపారం ఆగిపోవడంతో అప్పులు తీర్చేమార్గం లేక వేదనకు గురై గుండెపోటుతో మరణించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.


