News April 21, 2025
కర్నూలు: పిడుగుపాటుతో యువకుడి మృతి

కర్నూలు జిల్లా పెద్దకడబూరు మండలం హనుమాపురంలో విషాద ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన గొల్ల గోవిందు కుమారుడు గొల్ల ఈరన్న మరికొందరు ఆదివారం రాత్రి ఎమ్మిగనూరు SML డిగ్రీ కాలేజ్ వద్ద ఉన్నారు. అక్కడ ఒక్కసారిగా మెరుపులతో పిగుడు పడింది. దీంతో అక్కడున్న నలుగురు స్వల్ప గాయాలు కాగా.. ఈరన్న అక్కడికక్కడే మృతి చెందాడు. మృతదేహాన్ని ఎమ్మిగనూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News April 21, 2025
కర్నూలు: బాబోయ్ అడ్మిషన్‌లా..? భయపడిపోతున్న ప్రైవేట్ టీచర్స్

కర్నూలు జిల్లాలో రాబోయే విద్యా సంవత్సరానికి అడ్మిషన్ల కోసం ప్రైవేట్ స్కూల్ టీచర్లు పరుగులు పెడుతున్నారు. కొన్ని స్కూల్స్‌లో టార్గెట్లు ఇవ్వడంతో ఒత్తిడికి గురవుతున్నట్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మినిమం అడ్మిషన్లు తెస్తేనే జీతాలు ఇస్తామంటూ హుకుం జారీ చేయడంతో మండుటెండల్లో రోడ్ల వెంట పరుగులు పెడుతున్నారు. విద్యా సంవత్సరం మారుతున్న ప్రతిసారి ఇదే పరిస్థితితంటూ ప్రైవేటు టీచర్లు వాపోతున్నారు.
News April 21, 2025
రక్తదానం చేసిన కర్నూలు ఎంపీ నాగరాజు

రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు 75వ జన్మదినం సందర్భంగా.. కర్నూలులోని బ్లడ్ బ్యాంకులో TDP నాయకులు ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని MP నాగరాజు ప్రారంభించారు. అనంతరం ఎంపీ స్వయంగా రక్తదానం చేశారు. చంద్రబాబు ఎల్లప్పుడు ఆయురారోగ్యాలు, సుఖ సంతోషాలతో ఉండాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. కార్యకర్తలకు అండగా నిలుస్తానన్నారు.
News April 20, 2025
కర్నూలు జిల్లా నేటి ముఖ్యాంశాలు

➤ కర్నూల్ జిల్లా TDP నాయకుడు సురేంద్ర మృతి
➤కర్నూలు: 3 శాతానికి పెరిగిన స్పోర్ట్స్ కోటా.!
➤రూపాయి నోటుపై సీఎం చంద్రబాబు చిత్రం
➤కానిస్టేబుల్ హత్య కేసులో నిందితుల అరెస్ట్
➤కోవెలకుంట్లలో క్రికెట్ బెట్టింగ్ ముఠా గుట్టురట్టు
➤అనంత: బీటెక్ ఫలితాలు విడుదల
➤సురేంద్ర మృతి పార్టీకి తీరని లోటు: కర్నూలు MP
➤సీఎం బర్త్ డే.. ఎమ్మిగనూరులో 75 కేజీల కేక్ కటింగ్
➤కర్నూలు జిల్లాలో దంచికొట్టిన వర్షం