News March 18, 2024

కర్నూలు: పీజీ సెమిస్టర్‌కు 90శాతం హాజరు

image

కర్నూలు రాయలసీమ యూనివర్సిటీ పరిధిలో పీజీ సెమిస్టర్ పరీక్షలు జరుగుతున్న విషయం తెలిసిందే. సోమవారం జరిగిన పీజీ కోర్సుల మొదటి సెమిస్టర్ పరీక్షకు సోమవారం నాడు 90 శాతం విద్యార్థులు హాజరైనట్లు యూనివర్శిటీ అధికారులు వెల్లడించారు. మొత్తం 558 మంది విద్యార్థులకు గాను.. 53 మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారని పేర్కొన్నారు.

Similar News

News September 25, 2025

అంతర్జాతీయ యోగా సమైక్య డైరెక్టర్‌గా అవినాష్ శెట్టి

image

అంతర్జాతీయ యోగా సమైక్య డైరెక్టర్‌గా కర్నూలు జిల్లాకు చెందిన యోగా సంఘం అధ్యక్షుడు అవినాష్ శెట్టిని నియమిస్తూ యోగా ఫెడరేషన్ ఆఫ్ ఏషియా అధ్యక్షుడు డాక్టర్ రాధాకృష్ణ, అంతర్జాతీయ యోగా స్పోర్ట్స్ ఫెడరేషన్ అధ్యక్షుడు ధర్మచారి మైత్రీవనం గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. 2025 నుంచి 2028 వరకు అవినాష్ శెట్టి పదవిలో కొనసాగుతారని పేర్కొన్నారు. అవినాష్ శెట్టికి క్రీడాకారులు అభినందనలు తెలిపారు.

News September 25, 2025

చీపురి పట్టిన కర్నూలు కలెక్టర్ డా.సిరి

image

కర్నూలులో గురువారం నిర్వహించిన ‘ఏక్ దిన్ ఏక్ గంట ఏక్ సాత్’ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి పాల్గొన్నారు. తుంగభద్ర నది సమీపంలోని సంకల్ భాగ్ వద్ద చీపురుపట్టి పరిసరాలను శుభ్రం చేశారు. పరిశుభ్రతకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రాధాన్యత ఇస్తున్నాయని, ప్రతి ఒక్కరూ భాగస్వాములై పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఆమె పిలుపునిచ్చారు. శుభ్రతతోనే ఆరోగ్యంగా ఉంటామని చెప్పారు.