News March 25, 2024

కర్నూలు: పోక్సో కేసు నమోదు

image

కర్నూలుకు చెందిన లతీఫ్ అనే వ్యక్తిపై 2టౌన్ పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. భార్యతో పాటు 8మంది ఆడ సంతానం కలిగిన ఇతను ఈనెల 1న 16 ఏళ్ల బాలికను నమ్మించి హైదరాబాద్‌కు తీసుకెళ్లి పెళ్లి చేసుకునేందుకు యత్నించినట్లు సమాచారం. దీంతో తమ కూతురు కనిపించడం లేదని బాలిక తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేశారు. కేసు విషయం తెలిసి ఈనెల 21న బాలికను తిరిగి కర్నూలుకు తీసుకువచ్చాడు.

Similar News

News July 8, 2024

కర్నూలు: వెబ్సైట్‌లో ఇసుక నిల్వల వివరాలు

image

ప్రభుత్వ ఆదేశాల మేరకు కర్నూలు జిల్లాలో ఇవాళ నుంచి ఉచిత ఇసుక విధానం అమలవుతోంది. వినియోగదారులు ఇసుక సమాచారం వివరాలు https://www.mines.ap.gov.in/permit/ అనే వెబ్సైట్‌లో చూసుకోవాలని జిల్లా గనులు, భూగర్భ శాఖ ఉప సంచాలకులు రాజశేఖర్ తెలిపారు. ఇసుక స్టాక్ పాయింట్ ఎక్కడ ఉంది, ఎంత నిల్వ ఉంది, తదితర వివరాలు వెబ్‌సైట్‌లో ఉంటాయని పేర్కొన్నారు.

News July 8, 2024

నంద్యాల: భూ తగదా.. వేట కొడవలితో దాడి

image

డోన్ మండలం వెంకటనాయునిపల్లెలో భూ తగాదా హత్యాయత్నానికి దారి తీసింది. స్థానికుల వివరాలు.. మాదయ్యను అదే గ్రామానికి చెందిన తండ్రీకొడుకులు చెన్నయ్య, ఇంద్రప్ప ఆదివారం సాయంత్రం వేట కొడవలితో తలపై నరికారు. తీవ్ర గాయాలైన మాదయ్యను వైద్యం కోసం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

News July 8, 2024

క్రెడిట్ కార్డు మోసాలపై అప్రమత్తంగా ఉండండి: నంద్యాల ఎస్పీ

image

క్రెడిట్ కార్డు మోసాలపై అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు నంద్యాల ఎస్పీ రఘువీర్ రెడ్డి సూచించారు. సైబర్ నేరగాళ్లు తాము బ్యాంక్ నుంచి ఫోన్ చేస్తున్నామని మీకు ఇన్సూరెన్స్ యాడ్ చేస్తామని ఒక యాప్ లింక్ పంపి దాంట్లో మీ క్రెడిట్ కార్డు వివరాలు నమోదు చేయాలని అడుగుతారని వివరాలు తెలపగానే క్రెడిట్ కార్డు నుంచి డబ్బులు మాయం చేస్తారని తెలిపారు. ఎవరైనా ఫోన్ ద్వారా వ్యక్తిగత వివరాలు అడిగితే చెప్పవద్దని సూచించారు.