News May 14, 2024
కర్నూలు: పోలింగ్ కేంద్రంలో వ్యక్తి మృతి

మంత్రాలయం మండలం మాధవరం గ్రామానికి చెందిన ఈరన్న సోమవారం ఓటేసేందుకు వెళ్లి పోలింగ్ బూత్‌లోనే మృతిచెందారు. మాధవరంలో ప్రాథమిక పాఠశాలలో ఓటేసేందుకు గంటల తరబడి క్యూలో నిల్చున్నారు. అప్పటికే కళ్లు తిరుగుతున్నాయని తోటి ఓటర్లతో చెప్పారు. చివరికి ఓటు వేసి బయటకు వస్తుండగా స్పృహ తప్పి పడిపోయారు. అక్కడే ఉన్న ఎన్నికల సిబ్బంది, తోటి ఓటర్లు ఆస్పత్రికి తీసుకువెళ్లగా అప్పటికే మృతిచెందారు.
Similar News
News April 5, 2026
కర్నూలు: 205 ఉద్యోగాలకు ఎల్లుండే ఇంటర్వ్యూ

కర్నూలులోని ఉపాధి కార్యాలయంలో ఈ నెల 7న ఉదయం 10 గంటలకు ఉద్యోగ మేళా నిర్వహించనున్నట్లు ఉపాధి అధికారిణి దీప్తి తెలిపారు. ఇన్నోవిజన్, GPS రెన్యవబుల్ ఎనర్జీ, బ్లూస్లార్, అంబర్ తదితర సంస్థలు ప్రొడక్షన్ ఆపరేటర్, మెషీన్ ఆపరేటర్, సెక్యూరిటీ గార్డ్, టెలీకాలర్ పోస్టులకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తాయన్నారు. 205 ఖాళీలున్నాయని, 10వ తరగతి నుంచి బీటెక్ వరకు చదివిన 19-30 ఏళ్ల వయసున్న వారు అర్హులని పేర్కొన్నారు.
News April 4, 2026
డెంగ్యూ లక్షణాలపై తప్పనిసరి పరీక్షలు

డెంగ్యూ లక్షణాలున్న ప్రతి ఒక్కరికీ తప్పనిసరిగా పరీక్షలు నిర్వహించాలని డీఎంహెచ్‌ఓ డా. కామేశ్వర ప్రసాద్ సూచించారు. ఓల్డ్ లెక్చరర్ గ్యాలరీలో జరిగిన మలేరియా ల్యాబ్ టెక్నీషియన్స్ సమావేశంలో మాట్లాడారు. రోజుకు 65 పరీక్షలు నిర్వహించాలన్నారు. ఎఫ్‌ఆర్‌ఎస్ టైమ్ ప్రకారం విధులు నిర్వహించాలని తెలిపారు. హెచ్ఐవి, టీబీ కేసుల రికార్డులను సక్రమంగా నిర్వహించి ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని ఆదేశించారు.
News April 4, 2026
సూర్యఘర్ ఉత్సవ్‌కు శ్రీకారం: సీఎండీ

ఈ నెల 5 నుంచి 14 వరకు ‘సూర్యఘర్ ఉత్సవ్’ నిర్వహిస్తున్నట్లు ఏపీఎస్పీడీసీఎల్ సీఎండీ శివశంకర్ లోతేటి తెలిపారు. 9 జిల్లాల్లో 25 వేల ఎస్సీ, ఎస్టీ ఇళ్లపై రూఫ్‌టాప్ సోలార్ వ్యవస్థల ఏర్పాటు లక్ష్యంగా పనులు వేగవంతం చేయాలని అధికారులకు ఆదేశించారు. 25 వేల ఎస్సీ, ఎస్టీ వినియోగదారుల గృహాలపై రూఫ్‌టాప్ సోలార్ సిస్టమ్స్ ఏర్పాటు లక్ష్యానికి అనుగుణంగా అధికారులు, సిబ్బంది, ఏజెన్సీలు సమన్వయంతో పనిచేయాలని తెలిపారు.


