News August 31, 2025

కర్నూలు: ‘ప్రజలకు మెరుగైన సేవలు అందించాలి’

image

కర్నూలు నగర ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే నగరపాలక సంస్థ ప్రధాన లక్ష్యమని, ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ముందడుగులు వేస్తున్నట్లు నగరపాలక సంస్థ కమిషనర్ పి.విశ్వనాథ్ అన్నారు. శుక్రవారం స్థానిక ఎస్బీఐ ఎంప్లాయిస్ కాలనీలోని నగరపాలక సమావేశ భవనంలో “ఓపెన్ ఫోరం” కార్యక్రమం నిర్వహించారు. వివిధ ప్రాంతాలకు చెందిన పలువురు పౌరులు ఎల్‌ఆర్‌యస్, నిర్మాణ అనుమతులు, అక్రమ నిర్మాణాలపై అర్జీలు సమర్పించారు.

Similar News

News August 31, 2025

నిమజ్జన కార్యక్రమాన్ని పర్యవేక్షించిన ఎస్పీ

image

ఆదోని మండలం హరివాణంలో ఆదివారం ఎల్లెల్సీ కెనాల్ వద్ద జరుగుతున్న గణేశ్ష్ నిమజ్జన కార్యక్రమాన్ని ఎస్పీ విక్రాంత్ పాటిల్ పర్యవేక్షించారు. నిమజ్జనం సజావుగా సాగేలా గట్టి చర్యలు తీసుకోవాలని సిబ్బందిని ఆయన ఆదేశించారు. వినాయక నిమజ్జనం పూర్తి అయ్యేవరకు అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

News August 31, 2025

రూ.12కు ప్రభుత్వం ఉల్లిని కొనుగోలు చేస్తుంది: కలెక్టర్

image

మార్క్‌ఫెడ్ ద్వారా రూ.12కు ప్రభుత్వం ఉల్లిని కొనుగోలు చేస్తుందని, అందుకు సంబంధించి తగిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ పి.రంజిత్ బాషా అధికారులను ఆదేశించారు. ఆదివారం మార్కెటింగ్, మార్కెట్ యార్డ్ సెక్రటరీ అధికారులతో ఉల్లి కొనుగోలు అంశంపై టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. నేటి నుంచి మార్క్‌ఫెడ్ ద్వారా మార్కెట్ యార్డులలో కొనుగోలు ప్రారంభించాలని ఆదేశించారు.

News August 31, 2025

ఒకే గ్రామంలో 8 మందికి టీచర్ ఉద్యోగాలు

image

దేవనకొండ మండలం కప్పట్రాళ్ల గ్రామానికి చెందిన 8 మంది డీఎస్సీలో సత్తా చూపారు. ఉపాధ్యాయులుగా ఎంపికైన వారిని, వారి తల్లిదండ్రులను బీసీ కార్పొరేషన్ ఛైర్ పర్సన్ బుజ్జమ్మ సన్మానించారు. తన ఊరిలో 8 మంది ఉపాధ్యాయులుగా ఎంపికవ్వడం ఆనందంగా, గర్వంగా ఉందని ఆమె తెలిపారు.