News April 13, 2025

కర్నూలు: ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక రద్దు

image

ఈనెల 14వ తేదీన డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ జయంతి సందర్భంగా కర్నూలులో నిర్వహించే “ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక” కార్యక్రమం రద్దు చేయబడినట్లు జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా శనివారం ప్రకటించారు. ఈ మేరకు ప్రజలు వారి సమస్యలను తెలియజేసేందుకు కలెక్టరేట్‌కు రావద్దని సూచించారు. జిల్లాలో ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని విజ్ఞప్తి చేశారు.

Similar News

News April 13, 2025

క్యాన్సర్‌ను జయిస్తూ 420 మార్కులతో ప్రతిభ 

image

బ్లడ్ క్యాన్సర్‌ బారిన పడి కోలుకుంటున్న కర్నూలు జిల్లా విద్యార్థిని ఇంటర్ ఫలితాల్లో సత్తా చాటారు. గోనెగండ్లకు చెందిన సృజనామృత బైపీసీలో 440కు గానూ 420 మార్కులతో ప్రతిభ చూపారు. కర్నూలులోని ఓ కళాశాలలో చదువుతన్న బాలిక క్యాన్సర్‌ను జయిస్తూ ఉత్తమ ఫలితాలు సాధించండంపై అధ్యాపకులు అభినందించారు. తండ్రి ఉరుకుందు గౌడ్ ప్రోత్సాహంతో ఉన్నత చదువులు చదివి గ్రామానికి మంచి పేరు తీసుకొస్తానని బాలిక తెలిపారు.

News April 13, 2025

హఫీజ్ ఖాన్‌కు వైఎస్ జగన్ కీలక పదవి!

image

వైసీపీ పొలిటికల్ అడ్వైజరీ కమిటీలో ఉమ్మడి కర్నూలు జిల్లా నేతలకు చోటు దక్కింది. మాజీ మంత్రి బుగ్గల రాజేంద్రనాథ్ రెడ్డి, కర్నూలు మాజీ ఎమ్మెల్యే అబ్దుల్ హఫీజ్ ఖాన్‌కు ఆ కమిటీలో చోటు కల్పిస్తూ వైసీపీ కార్యాలయం నుంచి ఉత్తర్వులు వెలువడ్డాయి. సజ్జల రామకృష్ణారెడ్డి కన్వీనర్‌గా మొత్తం 33 మందితో ఈ కమిటీని ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ ఏర్పాటు చేశారు. కమిటీలోని సభ్యులు జగన్‌కు రాజకీయ సలహాలు ఇవ్వనున్నారు.

News April 13, 2025

రాష్ట్ర స్థాయి టాపర్‌గా ఆదర్శ రైతు కుమారుడు

image

కర్నూలు జిల్లా గోనెగండ్లకు చెందిన ఆదర్శ రైతు కారుమంచి షేక్ అహ్మద్ కుమారుడు షేక్ ఆసిఫ్ ఇంటర్ ఫలితాల్లో రాష్ట్రస్థాయి ర్యాంక్ సాధించారు. బైపీసీలో 440/430 మార్కులు సాధించి టాప్-10లో చోటుసాధించారు. విద్యార్థిని లెక్చరర్లు, కుటుంబ సభ్యులు అభినందించారు. ఆసిఫ్ మాట్లాడుతూ.. తండ్రి ఆశయాలకు అనుగుణంగా వైద్య విద్య పూర్తి చేసి గ్రామస్థులకు సేవలందిస్తానని చెప్పారు.

error: Content is protected !!