News August 28, 2025

కర్నూలు: ప్రేమికులను బెదిరించి డబ్బులు వసూలు చేసే ముఠా అరెస్ట్

image

కర్నూలు శివారులోని జగన్నాథ గట్టుపైకి వెళ్లే ప్రేమికులను బెదిరించి డబ్బు, చైన్లు లాక్కుంటున్న నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. నగరానికి చెందిన నాగేంద్రుడు, రమేశ్, మాలిక్ బాషాలను అరెస్ట్ చేసినట్లు సీఐ విక్రమ సింహ వెల్లడించారు. ఈ నెల 19న వచ్చిన ఫిర్యాదుపై విచారణ చేసి నిందితులను అదుపులోకి తీసున్నామని చెప్పారు. వారి నుంచి రూ10,500 నగదు, కత్తి, స్కూటీ, కారు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.

Similar News

News August 28, 2025

Way2News కథనానికి స్పందించిన ఆదోని సబ్ కలెక్టర్

image

Way2News కథనానికి సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ స్పందించారు. బుధవారం ‘ఆదోనిలో వైరల్ ఫీవర్లు.. హాస్పిటల్లో <<17531451>>రోగుల ఇబ్బందులు<<>>’ శీర్షికతో కథనం వెలువడింది. స్పందించిన సబ్ కలెక్టర్ ఇవాళ జనరల్ ఆస్పత్రిని సందర్శించారు. వార్డుల్లో కలియతిరిగి రోగుల సమస్యలపై ఆరా తీశారు. వైద్యులు సరైన వైద్యం అందిస్తున్నారా, లేదా అని అడిగి తెలుసుకున్నారు. ఆస్పత్రిలో సిబ్బంది కొరతను తీర్చి, ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తామన్నారు.

News August 28, 2025

కర్నూలులో డీఎస్సీ అభ్యర్థుల సర్టిఫికెట్ వెరిఫికేషన్ ప్రారంభం

image

డీఎస్సీ అభ్యర్థుల సర్టిఫికెట్ వెరిఫికేషన్ ప్రక్రియ గురువారం కర్నూలు DEO శామ్యూల్ పాల్ అధ్యక్షతన ప్రారంభమైంది. రాయలసీమ యూనివర్సిటీలో జరుగుతున్న కౌన్సిలింగ్ ప్రక్రియను రాష్ట్ర విద్యాశాఖ అధికారులతో కలిసి జాయింట్ కలెక్టర్ నవ్య పరిశీలించారు. కౌన్సెలింగ్ సెంటర్ వద్ద ఏర్పాటు చేసిన సౌకర్యాల గురించి అభ్యర్థులను అడిగి తెలుసుకున్నారు.

News August 28, 2025

వ్యవసాయ కుటుంబంలో మెరిసిన విద్యా కుసుమం

image

డీఎస్సీ పరీక్ష ఫలితాల్లో దేవనకొండ మండలం కొత్తపేటకి చెందిన పీరా సాహెబ్, షాజిదాబీ దంపతుల కూతురు మస్తాన్ బి సత్తా చాటారు. తల్లిదండ్రులు పొలం పనులు చేస్తూ కూతురు ఉన్నత శిఖరాలను చూడాలని ఎన్నో కలలు కన్నారు. ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని చదివించారు. మస్తాన్ బి డీఎస్సీ ఫలితాలలో 77.88 మార్కులు సాధించి ఎస్‌జిటి పోస్ట్‌కు ఎంపికైంది. తల్లిదండ్రులు, గ్రామస్థులు హర్షం వ్యక్తం చేశారు.