News October 30, 2024
కర్నూలు: బీఈడీలో ఫెయిలైన వారికి మరో అవకాశం
రాయలసీమ యూనివర్సిటీ పరిధిలోని బీఈడీలో ఫెయిల్ అయిన విద్యార్థులకు మరో అవకాశాన్ని కల్పిస్తున్నట్లు వర్సిటీ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. వర్సిటీ పరిధిలోని బీఈడీ కళాశాలలో విద్యను అభ్యసించి కోర్సును పూర్తి చేసుకోలేని 2015, 2016, 2017, 2018, 2019 విద్యా సంవత్సరాలకు చెందిన విద్యార్థులకు మరో అవకాశం ఇస్తున్నట్లు తెలిపారు. ఫెయిల్ అయిన విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
Similar News
News October 30, 2024
ఆదోని మార్కెట్ యార్డుకు 4 రోజుల సెలవులు
దీపావళి వేళ ఆదోని మార్కెట్ యార్డుకు రేపటి నుంచి ఆదివారం వరకు సెలవులు ప్రకటించారు. హమాలీ సంఘాలు, కమీషన్ ఏజెంట్ల విన్నపం మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు మార్కెట్ యార్డ్ కార్యదర్శి రామ్మోహన్ రెడ్డి తెలిపారు. నవంబర్ 4 నుంచి క్రయవిక్రయాలు మొదలవుతాయని చెప్పారు. రైతులు గమనించాలని కోరారు.
News October 30, 2024
కర్నూలు నియోజకవర్గ ఓటర్ల జాబితా ప్రచురణ
స్పెషల్ సమ్మరీ రివిజన్‌లో భాగంగా కర్నూలు నియోజకవర్గానికి సంబంధించిన ఓటర్ల జాబితాను అధికారులు ప్రచురించారు. మంగళవారం నగరపాలక సంస్థ కార్యాలయంలో నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్ అధికారి, నగరపాలక కమిషనర్ ఎస్.రవీంద్ర బాబు, తహశీల్దార్ వెంకటలక్ష్మి ముసాయిదాను ప్రచురించి, రాజకీయ పార్టీల ప్రతినిధులకు ముసాయిదా ప్రతులను అందజేశారు. వచ్చే నెల 28వ తేదీ వరకు దరఖాస్తులు, అభ్యంతరాలు స్వీకరణ ప్రక్రియ జరుగుతుందన్నారు.
News October 30, 2024
కర్నూలు జిల్లాలో కరవు మండలాలు ఇవే!
కర్నూలు జిల్లాలోని కౌతాళం, పెద్దకడుబూరు మండలాలను కరవు మండలాలుగా ప్రకటించినట్లు ఏపీ రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ(APSDMA) ఎండీ రోణంకి కూర్మనాథ్ తెలిపారు. ఈ రెండు మండలాలను మధ్యస్థ కరవు మండలాలుగా ప్రభుత్వం పేర్కొందన్నారు. కేంద్ర వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఖరీఫ్-2024 నివేదికల ప్రకారం ఈ మండలాలను మధ్యస్థ కరవు మండలాలుగా ప్రభుత్వం ప్రకటించినట్లు ఆయన వెల్లడించారు.