News February 15, 2025

కర్నూలు మీదుగా మహా కుంభమేళాకు ప్రత్యేక బస్సు

image

ఏపీ టూరిజం ఆధ్వర్యంలో యూపీ ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళాకు ప్రత్యేక బస్సు ఏర్పాటు చేశారు. ఈనెల 17న తిరుపతి, ఒంటిమిట్ట, ఓర్వకల్లు, కర్నూలు, హైదరాబాద్, బాసర, వారణాశి మీదుగా ప్రయాగ్‌రాజ్‌ చేరుకుంటుంది. తిరిగి జబల్‌పూర్, హైదరాబాద్, కర్నూలు, మహానంది మీదుగా తిరుపతి చేరుకుంటుంది. ఈ బస్సు 17న మ.2.15 గంటలకు కర్నూలుకు వస్తుంది. టికెట్ ధర రూ.20వేలు, పిల్లలకు రూ.17, 200లుగా నిర్ణయించారు.

Similar News

News December 15, 2025

చిత్తూరులో పెరిగిన కోడిగుడ్ల ధర

image

చిత్తూరు జిల్లాలో కోడి గుడ్ల ధరలు పెరుగుతూనే ఉన్నాయి. గత నెలలో డజన్ రూ.84లకే లభించేవి. ప్రస్తుతం రూ.96కు చేరుకుంది. ఈ ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని ఉత్పత్తిదారులు తెలుపుతున్నారు. అంగన్వాడీ, పాఠశాలలకు కోడిగుడ్లు సరఫరా చేసేవారు పెరిగిన ధరలతో ఇబ్బంది పడుతున్నారు. కోళ్ల పెంపకం తగ్గడంతో ధరలు పెరుగుతున్నాయని, జనవరి అనంతరం ధరలు తగ్గే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.

News December 15, 2025

MDK: గతంలో పారిశుద్ధ్య కార్మికుడు.. నేడు ఉపసర్పంచ్

image

ఐదేళ్లుగా పారిశుద్ధ్య కార్మికుడు, ట్రాక్టర్ డ్రైవర్‌గా విధులు నిర్వహించిన యువకుడు ఉప సర్పంచ్‌గా ఎన్నికయ్యారు. నార్సింగి మండలం శేరిపల్లికి చెందిన చెప్యాల విజయ్ కుమార్ గ్రామంలో రెండో వార్డులో పోటీ చేసి 36 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. దీంతో గ్రామంలో గత రాత్రి జరిగిన ఉపసర్పంచ్ ఎన్నికల్లో విజయ్ కుమార్‌ను ఉపసర్పంచ్‌గా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

News December 15, 2025

‘పెద్దపల్లి జిల్లాకు సెమీకండక్టర్ యూనిట్ ఇవ్వాలి’

image

జిల్లాకు సెమీకండక్టర్ యూనిట్ ఇవ్వాలని పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ ఢిల్లీలో కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్‌కు వినతిపత్రం ఇచ్చారు. పరిశ్రమలు వస్తే యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయన్నారు. సెమీకండక్టర్ ఇండస్ట్రీకి సరిపడా వనరులు, స్కిల్డ్ యువత జిల్లాలో ఉన్నారని కేంద్రమంత్రి దృష్టికి తీసుకెళ్లానని ఎంపీ పేర్కొన్నారు. గతంలోనే పెద్దపల్లికి రావాల్సిన ఇండస్ట్రీని చంద్రబాబును సంతోష పెట్టేందుకు APకి తరలించారన్నారు.