News May 20, 2024

కర్నూలు: మూడు మృతదేహాలపై వీడని సస్పెన్స్

image

గార్గేయపురం పరిధిలోని నగరవరం చెరువులో మొదట రెండు, కాసేపటికి మరో మహిళల మృతదేహం కలకలం రేపిన విషయం తెలిసిందే.. అయితే ఆ మూడు మృతదేహాలు ఎవరివనే విషయంపై ఇంకా స్పష్టత రానట్లు సమాచారం. వివాహేతర సంబంధం కలిగిన వ్యక్తులు ఆ ప్రాంతాలకు రాత్రిపూట ఎక్కువగా వస్తారని తెలియడంతో ఆ కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అయితే మృతులు తెలంగాణ వాసులుగా పోలీసులు అనుమానిస్తూ విచారణ చేస్తున్నట్లు తెలుస్తోంది.

Similar News

News February 28, 2026

కర్నూలు: ‘ఈ ఏడాదికి 45 లక్షల మొక్కలు నాటాలి’

image

కర్నూలు కలెక్టరేట్‌లో శనివారం 2026-27 ఆర్థిక సంవత్సరంలో చేపట్టబోయే Plantation గురించి జిల్లా కలెక్టర్ సిరి శనివారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. 2026-27 ఆర్థిక సంవత్సరంలో జిల్లా వ్యాప్తంగా భారీ ఎత్తున ప్లాంటేషన్ కార్యక్రమాన్ని చేపట్టాలని, అందుకుగాను 45 లక్షల మొక్కలను నాటడమే లక్ష్యంగా ప్రణాళికలు సిద్ధం చేయాలని కలెక్టర్ సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు.

News February 28, 2026

మార్చి 2న కలెక్టరేట్‌లో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక

image

మార్చి 2న ఉదయం 9:30 గంటలకు కర్నూలు కలెక్టరేట్‌లోని సునయన ఆడిటోరియంలో ‘ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక’ నిర్వహించనున్నట్లు కలెక్టర్ డా.ఏ.సిరి తెలిపారు. అర్జీల స్థితిగతుల కోసం 1100 కాల్ సెంటర్ నుంచి సమాచారం పొందవచ్చన్నారు. ప్రజలు తమ ఫిర్యాదులను ఆన్‌లైన్ వెబ్‌సైట్ ద్వారా కూడా నమోదు చేసుకోవచ్చని సూచించారు. జిల్లా ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు.

News February 28, 2026

మద్దూర్ నగర్‌లో పింఛన్లు పంపిణీ చేసిన కలెక్టర్

image

మార్చి 1వ తేదీ ఆదివారం కావడంతో ప్రభుత్వ ఆదేశాల మేరకు కర్నూలులోని మద్దూర్ నగర్‌లో ఎన్టీఆర్ భరోసా పింఛన్లను కలెక్టర్ స్వయంగా పంపిణీ చేశారు. లబ్ధిదారుల ఇళ్ల వద్దకే వెళ్లి నగదు అందజేస్తూ వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ప్రతి నెలా సరైన సమయానికి పింఛన్ అందుతుందా అని లబ్ధిదారులను అడిగారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలకు సక్రమంగా అందుతున్నాయని కలెక్టర్ పేర్కొన్నారు.