News October 17, 2025
కర్నూలు మోదీ సభ హైలైట్స్

★ చంద్రబాబు నాయకత్వంలో సరికొత్త శక్తిగా ఏపీ: పీఎం మోదీ
★ మోదీ సంస్కరణలు గేమ్ చేంజర్లు: సీఎం
★ మోదీ ఓ కర్మయోగి.. మరో 15ఏళ్లు కూటమి పాలన: డిప్యూటీ సీఎం
★ ప్రధాని కోరినవన్నీ ఇస్తున్నారు: లోకేశ్
★ అఖండ భారతావని బాగుండాలని శ్రీశైలంలో మోదీ పూజలు
★ లోకేశ్‌కు ప్రధాని కితాబు.. సరదా ముచ్చట
★ ₹13,429 కోట్ల పనులకు శ్రీకారం
★ టైం అంటే టైం.. షెడ్యూల్ ప్రకారమే సాగిన పర్యటన
★ సభలో 2 లక్షల మంది పాల్గొన్నారని అంచనా
Similar News
News October 19, 2025
నేడు అనంతపురంలో సందడి చేయనున్న సినీ నటి మీనాక్షి

సంక్రాంతికి వస్తున్నాం సినీ నటి మీనాక్షి చౌదరి ఆదివారం జిల్లాకు రానున్నారు. అనంతపురంలోని రాజీవ్ కాలనీలో ఓ షోరూం ప్రారంభోత్సవానికి ఆమె ముఖ్య అతిథిగా వస్తున్నట్లు నిర్వహకులు తెలిపారు. ఉదయం 11 గంటలకు ఈ కార్యక్రమం జరుగుతుందన్నారు. మంత్రి పయ్యావుల కేశవ్, ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ, ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ ఈ కార్యక్రమంలో పాల్గొంటారన్నారు.
News October 19, 2025
జనగామ: త్వరలో కొత్త పంచాయతీ అధికారి

త్వరలో జనగామ జిల్లాకు కొత్త పంచాయతీ అధికారి రానున్నారు. రాష్ట్రంలోని ఆరు జిల్లాలకు కొత్త డీపీవోలను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఇటీవల గ్రూప్- 1లో ఎంపికైన ఎ.నవీన్‌ను జనగామకు నియమించారు. ప్రస్తుతం శిక్షణలో ఉన్నందున శిక్షణ అనంతరం విధుల్లో చేరనున్నారు.
News October 19, 2025
VKB: మద్యం టెండర్లు.. ఈనెల 23 వరకు గడువు

వికారాబాద్ జిల్లాలో 59 మద్యం షాపుల టెండర్లకు శనివారం వరకు 1,750 దరఖాస్తులు వచ్చాయని జిల్లా ఎక్సైజ్ సూపరిండెంట్ విజయ్ భాస్కర్ గౌడ్ తెలిపారు. ఈ నెల 23 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని స్పష్టం చేశారు. ఈ నెల 23న కలెక్టర్ల సమక్షంలో జరగాల్సిన మద్యం షాపుల డ్రాను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. ఈ నెల 27న డ్రా తీయనున్నట్లు చెప్పారు.