News April 25, 2024

కర్నూలు: రానున్న మూడు రోజులు భగ భగలే..!

image

రానున్న రెండు, మూడు రోజుల పాటు 46-47 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదు కావచ్చని విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులు తెలిపారు. బుధవారం మహానందిలో 44.2 డిగ్రీలు, బనగానపల్లె, డోన్‌లో 44.1, కోడుమూరులో 43.9, కర్నూలులో 43.1 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మంత్రాలయం, కోడుమూరు, గూడూరు, దేవనకొండ, డోన్, చాగలమర్రి, గడివేముల, దొర్నిపాడు, రుద్రవరం మండలాల్లో ఎండల తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉందని తెలిపారు.

Similar News

News September 30, 2024

కర్నూలు: మార్కెట్‌కు ఉల్లి సరకు తీసుకురావద్దు

image

కర్నూలు మార్కెట్‌కు రైతులు ఉల్లి సరకు తీసుకురావద్దని రైతులకు, కమిషన్ దారులకు మార్కెట్ ఎంపిక శ్రేణి కార్యదర్శి ఆర్.జయలక్ష్మి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. వ్యవసాయ మార్కెట్‌లో అత్యధికంగా ఉల్లి వచ్చినందున మార్కెట్‌లో ఎక్కడా స్థలం కూడా ఖాళీ లేదని చెప్పారు. లారీలు వచ్చి వెళ్లడానికి కూడా ట్రాఫిక్ సమస్య ఉందని తెలిపారు.

News September 30, 2024

నంద్యాల: చెరువులో శిశువు మృతదేహం కలకలం

image

నంద్యాల పట్టణంలోని చెరువులో నెల వయసున్న శిశువు మృతదేహం సోమవారం కలకలం సృష్టించింది. అటుగా వెళుతున్న కొందరు సమాచారాన్ని పోలీసులకు అందించారు. చెరువు దగ్గరికి వచ్చి శిశువును పరిశీలించిన పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేపట్టారు. చెరువులో బతికి ఉన్న శిశువును పడేశారా లేదా చనిపోయిన శిశువును పడేశారా అని ప్రజలు చర్చించుకుంటున్నారు.

News September 30, 2024

దసరాకు 758 ప్రత్యేక బస్సులు

image

దసరా పండుగ సందర్భంగా APSRTC కడప జోన్ పరిధిలోని కడప, అన్నమయ్య, కర్నూలు, నంద్యాల, చిత్తూరు, తిరుపతి, అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాల పరిధిలో 758 ప్రత్యేక బస్సు సర్వీసులను నడపనున్నట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. ఈ సర్వీసులు అక్టోబర్ 4వ తేదీ నుంచి ప్రారంభమవుతాయన్నారు. హైదరాబాద్, బెంగళూరు, విజయవాడ, చెన్నై, కర్నూలు, తిరుపతి, నెల్లూరు, ఒంగోలు తదితర ప్రాంతాలకు రాకపోకలు సాగిస్తాయని అధికారులు అన్నారు.