News December 15, 2025

కర్నూలు రేంజ్‌లో 15 మంది ఎస్‌ఐల బదిలీ

image

కర్నూలు రేంజ్‌లోని పలు పోలీస్ స్టేషన్లలో పనిచేస్తున్న 15 మంది ఎస్‌ఐలకు పరిపాలనా కారణాల దృష్ట్యా బదిలీలు చేపట్టినట్లు డీఐజీ డా.కోయ ప్రవీణ్ ఉత్తర్వులు జారీ చేశారు. పోలీస్ ఎస్టాబ్లిష్‌మెంట్ బోర్డు సిఫారసుల మేరకు ఈ బదిలీలు అమలులోకి వచ్చాయి. బదిలీ అయిన ఎస్‌ఐలను వెంటనే రిలీవ్ చేసి, కొత్త విధుల్లో చేరేలా చర్యలు తీసుకోవాలని కర్నూలు, నంద్యాల ఎస్పీలకు డీఐజీ ఆదేశించారు.

Similar News

News December 27, 2025

సాగుభూమి సంరక్షణ వ్యవసాయంలో కీలకం

image

సాగు భూములకు రసాయనాల వాడకం తగ్గించడం, సేంద్రియ ఎరువుల వాడకం పెంచడం, పంట మార్పిడి, మిశ్రమ పంటల సాగు, సంప్రదాయ, దేశవాళీ పంట రకాల పెంపకం, నేలకోత నివారణ చర్యలు, నేలను కప్పి ఉంచడం వంటి చర్యలతో నేల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. సేంద్రియ ఎరువులు, పచ్చిరొట్ట ఎరువులు, పంటల అవశేషాలు, జీవన ఎరువులు, పశువుల వ్యర్థాలు, వర్మీకంపోస్టు వంటి సేంద్రియ ఎరువుల వాడకం వల్ల నేల ఆరోగ్యం మెరుగుపడుతుంది.

News December 27, 2025

WGL: అభివృద్ధి ఒక వైపేనా..!

image

గ్రేటర్ వరంగల్ నగరం పేరుకే గ్రేటర్‌లా ఉంది. అభివృద్ధి అంతా ఒక వైపే జరుగుతోంది. వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలోనే రెండేళ్లలో రూ.4 వేల కోట్లతో అభివృద్ధి పనులు పూర్తి చేస్తున్నారు.వరంగల్ తూర్పు, వర్ధన్నపేటలో మాత్రం ఇప్పటికీ రూ.100 కోట్ల లోపే పనులకు శంకుస్థాపనలు జరిగినట్టు ప్రజలు చెబుతున్నారు. వరంగల్ పశ్చిమలో నిత్యం శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు జరుగుతుండగా.. మిగిలిన 2 ప్రాంతాల్లో కనిపించకపోవడం గమనార్హం.

News December 27, 2025

తిర్యాణి: తల్లిదండ్రులు మందలించారని యువతి SUICIDE

image

ASF జిల్లా తిర్యాణి మండలం నాయకపూగూడకు చెందిన పల్లె స్పందన(19) శుక్రవారం సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరులో ఆత్మహత్య చేసుకుంది. కుటుంబీకుల వివరాల ప్రకారం.. HYDలో ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్న ఆమె, పని ఒత్తిడితో అనారోగ్యానికి గురైంది. ఇంటికి రావాలని తల్లిదండ్రులు మందలించడంతో మనస్తాపం చెంది శుక్రవారం ఫినాయిల్ తాగింది. చికిత్స పొందుతూ ఆస్పత్రిలో కన్నుమూసింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.