News April 11, 2024
కర్నూలు: రేపు ఇంటర్ ఫలితాల విడుదల

ఇంటర్ పరీక్ష ఫలితాలను శుక్రవారం విడుదల చేసే అవకాశం ఉన్నట్లు బోర్డు అధికారులు తెలిపారు. గత నెల 1 నుంచి 15వ తేదీ వరకు జిల్లాలోని 69 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించారు. మొదటి సంవత్సరం 22,239, ద్వితీయ సంవత్సరం 25,173 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. గత నెల18న ప్రారంభమైన మూల్యాంకనం అదేనెల 31వ తేదీతో ముగియాల్సి ఉంది. అయితే అనివార్య కారణాల వల్ల ఈనెల 4వ తేదీతో ఈ కార్యక్రమం ముగిసింది.
Similar News
News April 11, 2025
ఆదోని: రాజకీయ పార్టీ ప్రతినిధులతో కలెక్టర్ సమావేశం

ఆదోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో స్పెషల్ సమ్మరీ రివిజన్ 2025 లో భాగంగా ఆదోని నియోజకవర్గంలోని గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ సమీక్ష సమావేశం గురువారం నిర్వహించారు. ఈ సమావేశంలో ఫారం 6,7,8 నూతన ఓటర్ నమోదు, చిరునామా, మొదలగు అంశాలపై ఎన్నికల అధికారి/ సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ అధికారులతో చర్చించారు. ఎన్నికల ఉప తహశీల్దారు గాయత్రి, తదితరులు ఉన్నారు.
News April 11, 2025
కర్నూలు జిల్లాలో రాబోయే 3 గంటల్లో వర్షం

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు పడుతున్నాయి. కర్నూలు జిల్లాలోని పలు ప్రాంతాల్లో రాబోయే 3 గంటల్లో ఉరుములు మెరుపులతో కూడిన మోస్తరు వర్షాలు కురుస్తాయని విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. ప్రజలు సురక్షిత భవనాల్లో ఉండాలని సూచించింది. కాగా ఇవాళ సాయంత్రం నుంచి కర్నూలు నగరంలో వాతావరణ మారింది. అక్కడక్కడ వర్షాలు పడ్డాయి.
News April 11, 2025
కర్నూలు జిల్లా నేటి ముఖ్యాంశాలు

➤మంత్రాలయం: 25 జంటలకు తాలిబొట్లు, కాళ్ల మెట్టలు అందజేత ➤ జిల్లా నేతలకు వైఎస్ జగన్ దిశానిర్దేశం➤ అతివేగం.. మహిళ ప్రాణం తీసింది➤ శిరువెళ్ల హత్యాయత్నం కేసులో ఇద్దరి అరెస్ట్➤ కర్నూలు జిల్లాలో ఎస్ఐల బదిలీ➤ వెల్దుర్తి: క్యాస్ట్ సర్టిఫికేట్ కోసం వెళ్తే.. ఏమైందో చూడండి.!➤ హనుమాన్ శోభాయాత్రకి మంత్రి టీజీ భరత్ ఆహ్వానం➤ ఆదోని: రాజకీయ పార్టీ ప్రతినిధులతో సబ్ కలెక్టర్ సమావేశం.