News October 30, 2024

కర్నూలు: రేపు క్రాకర్స్ కాలుస్తున్నారా?.. అయితే ఇది మీకోసమే!

image

రేపు దీపావళి సందర్భంగా బాణసంచా కాల్చేటప్పుడు పలు జాగ్రత్తలు-సూచనలను తప్పనిసరిగా పాటించాలని ఏపీ రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ (APSDMA) పిలుపునిచ్చింది. అగ్ని ప్రమాదం సంభవిస్తే వెంటనే అత్యవసర సహాయం కోసం 101, 112, 100, 1070 టోల్ ఫ్రీ నంబర్లను సంప్రదించాలి అని సూచించింది. జాగ్రత్తలు-సూచనలకు సంబంధించి ఈ మేరకు APSDMA ఓ ఫోటోను Xలో ట్వీట్ చేసింది.

Similar News

News February 22, 2026

కర్నూలు: ”సీమను’ ఎడారిని చేసేందుకు చంద్రబాబు కుట్ర’

image

రాయలసీమలోని ఎత్తిపోతల పథకాలను నిలిపివేసి, ప్రాంతాన్ని ఎడారిగా మార్చాలని చంద్రబాబు కుట్ర చేస్తున్నారని వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సతీశ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు. ఆదివారం కర్నూలులో మాట్లాడారు. చంద్రబాబు డైవర్షన్ రాజకీయాలు మానుకోవాలని హితవు పలికారు. తిరుమల వివాదం వల్ల వెంకన్న శాపంతో హెరిటేజ్ సంస్థకు రూ.2,770 కోట్ల నష్టం వాటిల్లిందని, షేర్ల విలువ భారీగా పడిపోయిందని ఆయన విమర్శించారు.

News February 22, 2026

ఆ లింకులు నమ్మకండి.. ఎస్పీ హెచ్చరిక!

image

ఎనిమిదో వేతన సంఘం నేపథ్యంలో “8వ సీపీసీ శాలరీ కాలిక్యులేటర్” పేరుతో జరుగుతున్న సైబర్ మోసాలపై కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ హెచ్చరించారు. వాట్సాప్ ద్వారా పంపిస్తున్న ఏపీకే(APK) ఫైళ్లను డౌన్‌లోడ్ చేస్తే వ్యక్తిగత, బ్యాంకు వివరాలు చోరీకి గురయ్యే ప్రమాదం ఉందని తెలిపారు. తెలియని లింకులు ఓపెన్ చేయవద్దని, ఇటువంటి మోసాల పట్ల ప్రభుత్వ ఉద్యోగులు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు.

News February 22, 2026

కర్నూలు జిల్లా ప్రజలకు గమనిక!

image

కర్నూలు జిల్లా కలెక్టరేట్‌లోని సునయన ఆడిటోరియంలో సోమవారం ‘ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక’ (PGRS) నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ డా. ఏ.సిరి ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా కేంద్రంతో పాటు అన్ని మండల, డివిజనల్, మునిసిపల్ కార్యాలయాల్లోనూ అర్జీలు స్వీకరిస్తామన్నారు. గతంలో సమర్పించిన ఫిర్యాదుల స్థితిగతులను తెలుసుకునేందుకు ప్రజలు 1100 కాల్ సెంటర్‌ను సంప్రదించాలని ఆమె సూచించారు.