News March 21, 2024
కర్నూలు: వరుసగా 5సార్లు MLA.. 3సార్లు ఓటమి

ఎమ్మిగనూరు నియోజకవర్గంలో బీవీ మోహన్ రెడ్డిది ప్రత్యేక స్థానం అని చెప్పవచ్చు. నియోజకర్గంలో 8సార్లు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీలో నిలిచారు. అందులో 1983 నుంచి 1999 వరకు వరుసగా 5సార్లు టీడీపీ ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2004 నుంచి 2012 వరకు వరుసగా చెన్నకేశ్వరెడ్డి చేతిలో 3సార్లు ఓటమిపాలయ్యారు. 1985లో కాంగ్రెస్ అభ్యర్థి దేవేంద్ర గౌడ్‌పై 28904 అత్యధిక ఓట్ల మెజార్టీతో గెలుపొందిన రికార్డు ఉంది.
Similar News
News September 26, 2025
మెగా ఇండస్ట్రియల్ పార్కులు అభివృద్ధి చేస్తున్నాం: మంత్రి టీజీ

రాష్ట్రంలో కేంద్ర భాగస్వామ్యంతో మెగా ఇండస్ట్రియల్ పార్కులు అభివృద్ధి చేస్తున్నామని మంత్రి టీజీ భరత్ శాసనమండలిలో తెలిపారు. కృష్ణపట్నం, ఓర్వకల్లు, కొప్పర్తి, అనకాపల్లి ప్రాంతాల్లో వేల ఎకరాల్లో పారిశ్రామిక నోడ్‌లు, బల్క్ డ్రగ్ పార్క్‌లు ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. ప్రైవేట్ ఇండస్ట్రియల్ పార్కుల కోసం ప్రతిపాదనలు వచ్చాయని, స్థానికులకు ఉద్యోగాలు కల్పించేలా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు.
News September 26, 2025
రాష్ట్రస్థాయి పోటీల్లో కర్నూలు జిల్లాకు రెండో స్థానం

ఈనెల 25 నుంచి 26 వరకు పల్నాడు జిల్లాలో జరిగిన రాష్ట్రస్థాయి సీనియర్ మహిళల ఆట్యాపాట్యా పోటీలలో ఫైనల్స్‌లో కర్నూలు జిల్లా జట్టు పల్నాడు జట్టుపై 20-16 తేడాతో ఓడి ద్వితీయ స్థానంలో నిలిచినట్లు జిల్లా సంఘం సీఈవో నాగరత్నమయ్య తెలిపారు. లీగ్ దశలో మంచి ప్రతిభ చూపి ఫైనల్‌కు చేరుకొని పోరాడి ఓడిందన్నారు. టీమ్ శిక్షకుడిగా చరణ్ వ్యవహరించారు.
News September 26, 2025
ఆటో డ్రైవర్ నిజాయితీకి సీఐ ఫిదా

నిజాయితీకి ప్రతీకగా ఆటో డ్రైవర్ రవికుమార్ నాయక్ నిలిచారు. గురువారం కర్నూలులోని మౌర్య ఇన్ దగ్గర ఆటో ఎక్కిన ప్యాసింజర్ తన ఐఫోన్ మర్చిపోయి వెళ్లిపోయారు. డ్రైవర్ నిజాయితీతో రూ.80,000 విలువైన ఐ ఫోన్‌ను పోలీసులకు అప్పగించారు. నిజాయితీకి మెచ్చిన నాలుగో పట్టణ సీఐ విక్రమసింహ శాలువా కప్పి రవికుమార్ నాయక్‌ను సన్మానించారు. పోలీసుల సమక్షంలో బాధితుడికి ఫోన్ అప్పగించారు.