News June 15, 2024
కర్నూలు: వాము క్వింటా గరిష్ఠ ధర రూ.20,160

కర్నూలు వ్యవసాయ మార్కెట్లో శుక్రవారం పంట ఉత్పత్తుల ధరల వివరాలు ఇలా ఉన్నాయి. మార్కెట్కు 104 క్వింటాళ్ల వేరుశనక్కాయల దిగుబడులు రాగా.. క్వింటా కనిష్ఠ ధర రూ.4,929, మధ్యస్థ ధర రూ.6,371, గరిష్ఠ ధర రూ.7,200 పలికింది. 318 క్వింటాళ్ల వాము దిగుబడులు రాగా.. క్వింటా కనిష్ఠ ధర రూ.711, మధ్యస్థ ధర రూ.17,501, గరిష్ఠ ధర రూ.20,160 పలికినట్లు మార్కెట్ అధికారులు వెల్లడించారు.
Similar News
News October 3, 2025
కర్రల సమరంలో ముగ్గురి మృతి.. స్పందించిన కర్నూలు ఎంపీ

కర్నూలు(D) హొళగుంద(M) దేవరగట్టులో జరిగిన మాళమల్లేశ్వర స్వామి బన్నీ ఉత్సవంలో ముగ్గురు భక్తులు మృతి చెందడంతో పాటు 100 మందికి పైగా గాయపడిన ఘటనపై కర్నూలు ఎంపీ నాగరాజు దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. ఘటనపై అధికారులతో మాట్లాడిన ఆయన.. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. స్వామి జైత్ర యాత్రలో భక్తులు మృతి చెందడం బాధాకరమన్నారు. ప్రభుత్వం తరఫున ఆదుకుంటామన్నారు.
News October 3, 2025
దేవరగట్టులో మూడుకు చేరిన మృతుల సంఖ్య!

దేవరగట్టు కర్రల సమరంలో జరిగిన హింసలో మరొకరు మృతిచెందారు. దీంతో మృతుల సంఖ్య మూడుకు చేరింది. ఆలూరు మండలం అరికెరకు చెందిన తిమ్మప్ప, ఆలూరుకు చెందిన నాగరాజుగా గుర్తించారు. మరో మృతుడి వివరాలు తెలియాల్సి ఉంది. 2 లక్షలకు పైగా భక్తలు పాల్గొన్న ఈ ఉత్సవంలో స్వామి, అమ్మవార్ల ఊరేగింపు సందర్భంగా ఉత్సవమూర్తుల కోసం కర్రలతో 3 గ్రామాల ప్రజలు ఒకవైపు, 11 గ్రామాల ప్రజలు మరోవైపు ఉండి కొట్టుకుంటారు.
News October 2, 2025
ఖైదీలు సత్ప్రవర్తనతో మెలగాలి: కలెక్టర్

జాతిపిత మహాత్మా గాంధీ సూచించిన అహింస, శాంతి మార్గాలను ఎంచుకొని ఖైదీలు సత్ప్రవర్తనతో మెలగాలని కలెక్టర్ సిరి పేర్కొన్నారు. గురువారం పంచలింగాలలోని జిల్లా జైలులో ఖైదీల దినోత్సవం నిర్వహించారు. అక్టోబర్ 2న గాంధీ జయంతిని పురస్కరించుకొని జైలు ప్రాంగణంలోని గాంధీ విగ్రహానికి కలెక్టర్ పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి లీలా వెంకట శేషాద్రి పాల్గొన్నారు.