News April 7, 2024
కర్నూలు: వెటర్నరీ అంబులెన్స్ డ్రైవర్ పోస్టుల భర్తీ

కర్నూలు పశుసంవర్ధక శాఖ, ఆరోగ్య సేవ వెటర్నరీ అంబులేటరీ సర్వీస్ (1962)లలో డ్రైవర్(పైలెట్) పోస్టులు కర్నూలు, నంద్యాల జిల్లాల్లో ఖాళీగా ఉన్నాయని జీవీకే ఈఎంఆస్ఐ జిల్లా మేనేజర్ రామకృష్ణగౌడ్ ఒక ప్రకటనలో తెలిపారు. డ్రైవర్ పోస్టులకు 10వ తరగతి చదివి, హెవీ డ్రైవింగ్ లైసెన్స్ కలిగి, 36 ఏళ్లలోపు వారు అర్హులని పేర్కొన్నారు. వివరాలకు www.ahd.gov.in సంప్రదించాలన్నారు.
Similar News
News April 2, 2025
కర్నూలు జిల్లాలో పెన్షన్లు పంపిణీ చేసిన కలెక్టర్

ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీలో భాగంగా.. మంగళవారం కర్నూలులోని సాయిబాబా సంజీవ నగర్‌లో జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా వితంతు, వృద్ధాప్య పెన్షన్‌లను వారి ఇంటి వద్దకే వెళ్లి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మీడియాతో మాట్లాడుతూ.. అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి పంపిణీ చేశామని అన్నారు. మున్సిపల్ కమిషనర్ రవీంద్రబాబు హాజరయ్యారు.
News April 1, 2025
కర్నూలు జిల్లా నేటి ముఖ్యాంశాలు

➤కర్నూలులో మొదటి రోజు 93% పూర్తయిన పింఛన్ల పంపిణీ
➤ కర్నూలు: టెన్త్ పరీక్షలకు 430 మంది గైర్హాజరు-డీఈఓ
➤ కర్నూలు: సెక్షన్ 11 నోటీస్ ద్వారా ఫిర్యాదు చేయొచ్చు- సబ్ కలెక్టర్
➤ కర్నూలు జిల్లాలో 9 కరవు మండలాలు
➤ కర్నూలు జిల్లాలో వింత ఆచారం
➤ పెద్దకడబూరు: అనుమానాస్పద స్థితిలో యువకుడి మృతి
➤ కర్నూలు జిల్లాలో ప్రశాంతంగా ముగిసిన పదో తరగతి పరీక్షలు
News April 1, 2025
కర్నూలులో మొదటి రోజు 93% పూర్తయిన పింఛన్ల పంపిణీ

కర్నూలు జిల్లాలోని 29 మండలాల్లో మంగళవారం చేపట్టిన పింఛన్ పంపిణీ 93% పూర్తయినట్లు అధికారులు వెల్లడించారు. జిల్లా వ్యాప్తంగా 2,38,302 మంది పింఛన్ లబ్ధిదారులు ఉండగా, మొదటి రోజు 2,21,701 మందికి పింఛన్ పంపిణీ పూర్తయింది. ఇంకా 16,601 మందికి పింఛన్ పంపిణీ చేయాల్సి ఉంది. కాగా జిల్లాలోని కర్నూల్ అర్బన్‌లో 95% పంపిణీతో మొదటి స్థానం, 88%తో తుగ్గలి మండలం చివరి స్థానంలో ఉన్నట్లు అధికారులు తెలిపారు.