News April 26, 2024
కర్నూలు వైసీపీ ఎంపీ అభ్యర్థి ఆస్తి వివరాలు

కర్నూలు వైసీపీ ఎంపీ అభ్యర్థి బీవై రామయ్య నామినేషన్ పత్రాలను ఎన్నికల రిటర్నింగ్ అధికారిణి డా. సృజనకు అందజేశారు. బీవై రామయ్య కుటుంబం పేరిట రూ.2.98కోట్ల విలువైన ఆస్తులు ఉన్నట్లు అఫిడవిట్‌లో పేర్కొన్నారు. రామయ్యకు అప్పు రూ.30.78లక్షలు ఉన్నట్లు వెల్లడించారు. ఆయనపై అస్పరి పోలీసు స్టేషన్‌లో ఈ ఏడాది ఒక కేసు నమోదైంది.
Similar News
News April 24, 2025
క్రీడాకారులను అభినందించిన జిల్లా కలెక్టర్

జాతీయ స్థాయి టైక్వాండో పోటీలకు ఎంపికైన క్రీడాకారులను జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా ఘనంగా సత్కరించారు. మే నెలలో ఉత్తరాఖండ్‌లో జరగబోయే జాతీయస్థాయి కేడేట్, జూనియర్స్ విభాగాలలో జిల్లా క్రీడాకారులు పాల్గొని విజేతలుగా తిరిగి రావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో డీఎస్డీవో భూపతిరావు, కోచ్ షబ్బీర్ హుస్సేన్ పాల్గొన్నారు.
News April 23, 2025
597 మార్కులు సాధించిన ఆదోని విద్యార్థిని.!

ఆదోని పట్టణంలోని ఎస్.కె.డి కాలనీకి చెందిన దేవరకొండ సలీమా పదో తరగతి ఫలితాల్లో టౌన్ టాపర్‌గా నిలిచింది. బుధవారం వెలువడిన పదో తరగతి ఫలితాల్లో 597 మార్కులు సాధించింది. తండ్రి రంజాన్ బాషా కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తూ పిల్లలను చదివించారు. తన కష్టానికి ఫలితంగా.. తన కూతురు మంచి మార్కులు సాధించి తమ గౌరవాన్ని నిలబెట్టిందని తండ్రి సంతోషించారు.
News April 23, 2025
10th Results: 25వ స్థానంలో కర్నూలు జిల్లా

పదో తరగతి పరీక్షా ఫలితాల్లో కర్నూలు జిల్లా విద్యార్థులు సత్తా చాటారు. మొత్తం 31,185 మంది పరీక్ష రాయగా 20,584 మంది పాసయ్యారు. 16,326 మంది బాలురులో 9,854 మంది, 14,859 మంది బాలికలు పరీక్ష రాయగా 10,730 మంది పాసయ్యారు. 66.01 పాస్ పర్సంటైజ్‌తో కర్నూలు జిల్లా 25వ స్థానంలో నిలిచింది.