News August 23, 2025

కర్నూలు: సాధారణ కార్యకర్తకు రాష్ట్ర అధ్యక్షుడి పదవి

image

భారతీయ జనతా యువమోర్చా రాష్ట్ర అధ్యక్షుడిగా కర్నూలు జిల్లాకు చెందిన సునీల్ రెడ్డిని నియమిస్తూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీఎన్‌వీ మాధవ్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. విద్యార్థి దశ నుంచే సునీల్ రెడ్డి ఏబీవీపీలో క్రియాశీలకంగా పనిచేసి అనేక పోరాటాలను చేశారు. సునీల్ రెడ్డి నియామకం పట్ల జిల్లా నాయకులు హర్షం వ్యక్తం చేశారు. నిజమైన కార్యకర్తలకు పార్టీలో మంచి స్థానం ఉంటుందని అన్నారు.

Similar News

News August 23, 2025

పాడేరు పాలిటెక్నిక్ కళాశాలలో ఈనెల 25న జాబ్ మేళా

image

రాష్ట్ర నైపుణ్యభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఈనెల 25వ తేదీన పాడేరు పాలిటెక్నిక్ కళాశాలలో జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారిణి డాక్టర్ రోహిణి శుక్రవారం తెలిపారు. అపోలో ఫార్మసీ, నవత రోడ్డు ట్రాన్స్ పోర్ట్ తదితర కంపెనీల ప్రతినిధులు పాల్గొని నిరుద్యోగ అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తారన్నారు. ఇంటర్, డిగ్రీ, బీటెక్ ఆపై చదువులు పూర్తిచేసిన నిరుద్యోగ అభ్యర్థులు హాజరు కావాలన్నారు.

News August 23, 2025

గణేశ్ విగ్రహాల కొనుగోళ్లు HYDలో ట్రాఫిక్ ఆంక్షలు

image

గణేశ్ విగ్రహాల కొనుగోళ్ల నేపథ్యంలో నేటి నుంచి బుధవారం రా.10 గం. వరకు నగరంలోని వివిధ ప్రాంతాల్లో మళ్లింపులు ఉంటాయని ట్రాఫిక్ జాయింట్ CP జోయల్ డేవిస్ తెలిపారు. గాంధీ విగ్రహం, పురానాపూల్ నుంచి మంగళహాట్ వైపు వెళ్లే సాధారణ వాహనాలు టక్కర్‌వాడి టీ జంక్షన్, జిన్సీచౌరాహి మీదుగా మళ్లిస్తారు. వచ్చే వాహనాలు గాంధీ విగ్రహం, పురానాపూల్ మీదుగా దూల్‌పేటకు వచ్చి, బోటిగూడ కమాన్ క్రాస్ రోడ్ ద్వారా బయటికెళ్లాలన్నారు.

News August 23, 2025

నెల్లూరు: ఆథరైజ్డ్ బార్లకు నో రెస్పాన్స్

image

రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన బార్ల పాలసీ విధానాన్ని వ్యతిరేకిస్తూ జిల్లాలో ఆథరైజ్డ్ బార్ల దరఖాస్తులకు వ్యాపారులు ముందుకు రావడం లేదు. ఈనెల 18న జిల్లాలో బార్ల ఏర్పాటుకు గెజిట్ నోటిఫికేషన్ విడుదలై ఇప్పటి వరకు ఐదు రోజులు కావస్తున్నా దరఖాస్తులు దాఖలు కాలేదు. నూతన బార్ల విధానం నిర్వహకులకు భారంగా మారుతుందని పలువురు వాపోయారు.