News October 16, 2025
కర్నూలు సిద్ధం… వెల్‌కమ్ మోదీ జీ!

ప్రధాని మోదీకి కర్నూలు ప్రజలు స్వాగతం పలుకుతున్నారు. కాసేపట్లో ప్రత్యేక విమానంలో బయలుదేరనున్న ఆయన ఉ.10.20కి ఓర్వకల్లుకు చేరుకుంటారు. అనంతరం ఎంఐ-17 హెలికాప్టర్‌లో వెళ్లి శ్రీశైల మల్లన్నను దర్శించుకుంటున్నారు. మ.2.20కి కర్నూలులో జరిగి ‘జీఎస్టీ 2.0’ సభలో పాల్గొని రూ.13,400 కోట్ల విలువైన ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేస్తారు. మోదీకి <<18016530>>స్వాగతం<<>> పలుకుతూ కర్నూలులో భారీ ఫ్లెక్సీలు వెలిశాయి.
Similar News
News October 16, 2025
టీడీపీలో చేరేందుకు మాజీ ఎమ్మెల్యే కొండేటి ప్రయత్నాలు?

పి.గన్నవరం మాజీ ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు టీడీపీలో చేరేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. పార్టీలో చేరి ఇన్ ఛార్జ్ పదవి దక్కించుకోవాలన్నదే ఆయన ప్లాన్ గా సమాచారం. టీడీపీ పెద్దలు చిట్టిబాబును పార్టీలోకి తీసుకువచ్చేందుకు పావులు కదుపుతుండగా.. ఆ పార్టీలోని ఎస్సీ నేతలు అడ్డుకుంటున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. చిట్టిబాబు టీడీపీలో ఎంట్రీ జరిగేనా ? లేదా వేచి చూడాలి.
News October 16, 2025
వారంలోగా వాస్తవాలు తెలపండి: కృష్ణా బోర్డు

AP: పోలవరం-బనకచర్ల ప్రాజెక్టు DPR తయారీకి జారీ చేసిన టెండర్ నోటిఫికేషన్‌పై వారంలో వాస్తవాలు తెలపాలని రాష్ట్రాన్ని కృష్ణా బోర్డు ఆదేశించింది. DPR, ప్రాజెక్టు పనులన్నీంటినీ ఆపాలని TG ENC అంజాద్ ఇటీవల CWCకి లేఖ రాశారు. ఈ ప్రాజెక్టు ఫీజిబిలిటీ నివేదికను తిరస్కరించేలా CWCని ఆదేశించాలని కేంద్రానికి మంత్రి ఉత్తమ్ లేఖ రాసినట్లు వివరించారు. ఈ క్రమంలోనే బోర్డు స్పందించి తాజా ఆదేశాలిచ్చినట్లు తెలుస్తోంది.
News October 16, 2025
తెనాలి: ఆధిపత్య పోరుతో అన్యాయంగా చంపేశారు..?

అమృతలూరు(M) కోరుతాడిపర్రుకు చెందిన జూటూరి తిరుపతిరావు@ బుజ్జి తెనాలిలో మంగళవారం దారుణ హత్యకు గురైన సంగతి తెలిసిందే. సంచలనం రేకెత్తించిన హత్య కేసును పోలీసులు ఛేదించినట్టు తెలుస్తోంది.గ్రామంలోని రామాలయం విషయంలో ఆధిపత్య పోరుతో సమీప బంధువే ఈ హత్యకు పాల్పడ్డాడని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. పక్కా ఆధారాలతో నిందితుడిని గుర్తించిన పోలీసులు చాకచక్యంగా అతడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలుస్తోంది