News December 13, 2025

కర్నూలు: సూసైడ్ నోట్ రాసి విద్యార్థి బలవన్మరణం

image

సూసైడ్ నోట్ రాసి ఓ విద్యార్థి శుక్రవారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఎమ్మిగనూరు ఉప్పర వీధిలో ఉంటున్న శ్రీనివాసులు, మీనాక్షి కుమారుడు సంపత్ కుమార్(21) పట్టణంలోనే డిగ్రీ ఫైనలియర్ చదువుతున్నాడు. తల్లిదండ్రులను మధ్యాహ్నం సినిమాకు పంపించి, వారు సాయంత్రం ఇంటికి వచ్చే లోపు ఫ్యాన్‌కు ఉరేసుకున్నట్లు సమాచారం. తలనొప్పి భరించలేక ఆత్మహత్య చేసుకుంటున్నానని సూసైడ్ నోట్ రాసి జేబులో పెట్టుకున్నట్లు తెలుస్తోంది.

Similar News

News December 14, 2025

రేపు ఎన్నికలు జరిగే ప్రాంతాలకు సెలవు: సిద్దిపేట కలెక్టర్

image

రెండో విడత ఎన్నికల సందర్భంగా కలెక్టర్ సెలవు ప్రకటించారు. సిద్దిపేట జిల్లాలోని అక్బర్‌పేట్-భూంపల్లి, బెజ్జంకి, చిన్నకోడూర్, దుబ్బాక, మిరుదొడ్డి, నంగునూరు, నారాయణరావుపేట్, సిద్దిపేట రూరల్, సిద్దిపేట అర్బన్, తొగుట మండలాల పరిధిలోని గ్రామాల్లో ఎన్నికలు జరగనున్నాయి. 10 మండలాల్లోని గ్రామాల పరిధిలో గల ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు, కార్యాలయాలకు సెలవు ప్రకటిస్తున్నట్టు కలెక్టర్ హైమావతి పేర్కొన్నారు.

News December 14, 2025

పాలకుర్తి: సర్పంచ్ అభ్యర్థిపై కత్తిపోట్లు

image

పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలం రామారావుపల్లి గ్రామంలో సర్పంచ్ అభ్యర్థిగా బరిలో ఉన్న జనగామ మనోజ్ కుమార్ ను శనివారం రాత్రి 10 గంటల ప్రాంతంలో గుర్తు తెలియని దుండగులు హత్యాయత్నం చేశారు. తెల్లారితే పంచాయతీ ఎన్నికలు జరుగుతున్న క్రమంలో మనోజ్ కుమార్‌పై హత్యాయత్నం జరగడం వల్ల గ్రామం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. హత్యాయత్నానికి గల కారణాలు తెలియాల్సివుంది.

News December 14, 2025

NZB: అనాథ శవాలకు అంత్యక్రియలు

image

నిజామాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ సిబ్బంది గుర్తించిన అనాథ శవానికి అంత్యక్రియలను నిర్వహించాలని ఇందూరు యువత స్వచ్ఛంద సంస్థను కోరారు. దీంతో వారు సంప్రదాయ పద్దతిలో శనివారం అంత్యక్రియలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఇందూరు యువత స్వచ్ఛంద సేవ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు మద్దుకూరి సాయిబాబు, కోశాధికారి జయదేవ్ వ్యాస్, యూవీ ఫౌండేషన్ మెంబర్ సతీష్, రూరల్ పోలీస్ స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు.