News November 29, 2024
కర్నూలు: ‘సెమిస్టర్ పరీక్షలను పక్కగా నిర్వహించాలి’
పరీక్షలను సరిగ్గా నిర్వహించాలని ఇన్‌ఛార్జి వైస్ ఛాన్స్‌లర్ ఎన్టీకే నాయక్ అన్నారు. శుక్రవారం రాయలసీమ వర్సిటీ పరిధిలో డిగ్రీ 3వ, 5వ సెమిస్టర్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. యూనివర్సిటీ పరిధిలోని ఉమ్మడి కర్నూలు జిల్లాలో 61 పరీక్ష కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించారు. కర్నూలులో పరీక్ష కేంద్రాలను ఆయన పరిశీలించారు. 6,531 మంది విద్యార్థులు హాజరు కావాల్సి ఉండగా, 5,848 మంది హాజరయ్యారు. 683 గైర్హాజరయ్యారు.
Similar News
News November 29, 2024
అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు: ఎస్పీ
ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటామని నంద్యాల జిల్లా ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా తెలిపారు. ఆత్మకూరులో జరగబోయే ఉమామి తబ్లిగే ఇస్తేమా ఏర్పాట్లను పరిశీలించారు. ఎస్పీ మాట్లాడుతూ.. పార్కింగ్‌కు అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేస్తామన్నారు. హెల్ప్ డిస్క్ కూడా ఏర్పాటు చేస్తామని, ఏదైనా సహాయం కావాలంటే అక్కడ అడిగి తెలుసుకోవచ్చని తెలిపారు.
News November 29, 2024
గర్భిణులు, బాలింతలపై ప్రత్యేక దృష్టి సారించండి: కలెక్టర్
పుట్టిన వెంటనే నవజాత శిశువులు మృత్యువాత పడకుండా నిరంతరాయంగా పాలఫ్ చేస్తూ పిల్లలను సంరక్షించే బాధ్యత వైద్య, స్త్రీ శిశు సంక్షేమ శాఖ సిబ్బంది తీసుకోవాలని కలెక్టర్ రాజకుమారి ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాలులో మేటర్నిటీ అండ్ చైల్డ్ సమావేశం నిర్వహించారు. గర్భిణులు, బాలింతలపై ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ ఆదేశించారు.
News November 29, 2024
ఇస్తేమాకు రూ.10 కోట్ల నిధులు కేటాయించాం: మంత్రి ఫరూక్
ఆత్మకూరులో జనవరి 7, 8, 9వ తేదీల్లో జరగబోయే ఉమామి తబ్లిగే ఇస్తేమాను జయప్రదం చేయాలని మంత్రి ఫరూక్ కోరారు. ఉత్సవ ఏర్పాట్లను శుక్రవారం పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ.. గతంలో తాను మంత్రిగా ఉన్నప్పుడు కర్నూలు నన్నూరు టోల్ ప్లాజా దగ్గర ఇస్తామాను ఏర్పాటు చేశామన్నారు. అప్పుడు సీఎంగా ఉన్న చంద్రబాబు ఇస్తామాకు రూ.10 కోట్లు నిధులు కేటాయించారని తెలిపారు.