News October 2, 2024

కర్నూలు: 24 గంటల్లో మాట నిలబెట్టుకున్న సీఎం చంద్రబాబు

image

పత్తికొండ మండలం పుచ్చకాయలమడకు చెందిన అశోక్ అనే నిరుద్యోగి తనకు ఆటో ఇప్పించాలని నిన్న సీఎం చంద్రబాబును కోరిన విషయం తెలిసిందే. సీఎం హామీ మేరకు బుధవారం అశోక్‌కు ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు, కలెక్టర్ రంజిత్ బాషా ఆటో పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఆర్డీవో రామలక్ష్మి, టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడు సాంబ శివారెడ్డి పాల్గొన్నారు.

Similar News

News December 27, 2025

డిసెంబర్ 29న పీజీఆర్ఎస్: కర్నూలు కలెక్టర్

image

కర్నూలు కలెక్టరేట్‌లోని సునయన ఆడిటోరియంలో ఈ నెల 29న (సోమవారం) ‘ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక’ నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి తెలిపారు. జిల్లా స్థాయిలోనే కాకుండా మండల, మున్సిపల్, డివిజన్ కేంద్రాల్లోనూ ఈ కార్యక్రమం జరుగుతుందన్నారు. ప్రజలు తమ అర్జీల పరిష్కార స్థితిని కాల్ సెంటర్ నంబర్ 1100 లేదా Meekosam.ap.gov.in వెబ్‌సైట్ ద్వారా తెలుసుకోవాలని ఆమె సూచించారు.

News December 27, 2025

కర్నూలు జిల్లాలో 17,089 ఓపెన్ డ్రింకింగ్ కేసులు: ఎస్పీ

image

కర్నూలు జిల్లాలో బహిరంగ మద్యపానంపై ఉక్కుపాదం మోపుతున్నట్లు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ హెచ్చరించారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగుతూ ఇబ్బందులు కలిగిస్తే కఠిన చర్యలు తప్పవన్నారు. ఈ ఏడాది జనవరి నుంచి డిసెంబర్ 20 వరకు 17,089 కేసులు నమోదు చేసినట్లు వెల్లడించారు. ఇకపై బహిరంగ మద్యపానాన్ని ఏమాత్రం ఉపేక్షించబోమని, ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు స్పష్టం చేశారు.

News December 26, 2025

వీర్ బాల్ దివస్ వేడుకల్లో కర్నూలు కలెక్టర్ సిరి

image

బాలలకు సరైన అవకాశాలిస్తే అద్భుతాలు సృష్టిస్తారని కర్నూలు జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి అన్నారు. ఢిల్లీలో జరిగిన ‘వీర్ బాల్ దివస్–2025’లో ఆమె వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు. వీర్ బాల్ పురస్కారం అందుకున్న మద్దికెర మండలానికి చెందిన పారా అథ్లెట్ శివానిని కలెక్టర్ ప్రత్యేకంగా అభినందించారు. బాలల అభివృద్ధికి అన్ని శాఖలు సమన్వయంతో కృషి చేయాలని ఈ సందర్భంగా ఆమె సూచించారు.