News March 2, 2026

కర్నూలు @ 36°C

image

కర్నూలు జిల్లాలో ఎండలు అప్పుడే మండిపోతున్నాయి. సోమవారం మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో కర్నూలులో గరిష్ఠంగా 36 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఉదయం నుంచి ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటంతో జనం ఇబ్బందులు పడుతున్నారు. రాబోయే రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

Similar News

News March 2, 2026

హోలీ వేడుకలు ప్రశాంతంగా జరుపుకోవాలి: ADB SP

image

హోలీ పండుగను మతసామరస్యంతో, శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలని ఆదిలాబాద్ SP అఖిల్ మహాజన్ సూచించారు. జిల్లావ్యాప్తంగా పటిష్ఠ బందోబస్తుతో పాటు ప్రత్యేక డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపట్టామన్నారు. డీజేలకు అనుమతి లేదని, ఎవరిపై బలవంతంగా రంగులు చల్లరాదని హెచ్చరించారు. ఈత రానివారు చెరువులు, వాగుల వద్దకు వెళ్లకూడదని.. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు.

News March 2, 2026

ADB: PVTGల గుర్తింపు ప్రమాణాలు ఇలా.!

image

ఆదివాసీ తెగలలో అత్యంత వెనుకబడిన గిరిజన వర్గాలను గుర్తించేందుకు కేంద్రం 4, 5 ప్రణాళికలో PVTG అనే ప్రత్యేక కార్యాచరణను రూపొందించింది. 18 రాష్ట్రాలు, అండమాన్–నికోబార్ కేంద్ర పాలిత ప్రాంతాల్లో మొత్తం 75 PVTGలు ఉన్నాయి. ధేబర్ కమిషన్ సూచించిన ప్రమాణాలను బట్టి ఆయా వర్గాల సాంకేతిక స్థాయి, తగ్గుతున్న లేదా స్థిరమైన జనాభా, తక్కువ అక్షరాస్యత, జీవనాధార స్థాయి, ఆర్థిక స్థితిగతుల ఆధారంగా PVTGలను నిర్ణయిస్తారు.

News March 2, 2026

కామారెడ్డి: లీగల్ ఎయిడ్ సేవలను సద్వినియోగం చేసుకోవాలి: ఎస్పీ

image

సైబర్ నేరాల బారిన పడి ఆర్థికంగా నష్టపోయిన బాధితులకు తిరిగి నగదు పొందెందుకు తక్షణ సహాయం అందించేందుకు లీగల్ ఎయిడ్ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు ఎస్పీ రాజేశ్ చంద్ర వెల్లడించారు. బాధితులు ఈ సేవలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. మరిన్ని వివరాల కోసం టోల్ ఫ్రీ నంబర్ 15100 లేదా సమీప పోలీస్ స్టేషన్, లేదా జిల్లా సైబర్ క్రైమ్ సెల్‌ను సంప్రదించాలన్నారు.