News December 18, 2025
కర్నూలు: AP, తెలంగాణలో ఎస్సైగా ఎంపిక.. చివరికి..!

కర్నూలు జిల్లా తుగ్గలి పోలీస్ స్టేషన్‌లో అనంతపురం(D) తాడిపత్రి మండలం ఎర్రగుంటపల్లికి చెందిన నరేశ్ ఎస్సైగా గురువారం పదవీ బాధ్యతలు చేపట్టారు. 2022లో తెలంగాణ రాష్ట్రం చేపట్టిన ఎస్సై నియామకాల్లో ఎంపికయ్యారు. 2023లో ఏపీ విడుదల చేసిన ఎస్సై ఫలితాలలో ఉత్తీర్ణుడయ్యారు. తెలంగాణలో వద్దనుకొని ఏపీలో విధులు నిర్వహించేందుకు నిర్ణయించుకున్నారు. అనంతపురం PTC కళాశాలలో ట్రైనింగ్ అనంతరం తుగ్గలిలో బాధ్యతలు చేపట్టారు.
Similar News
News December 18, 2025
20న పాల్వంచలో జాబ్‌మేళా.. ఎస్‌బీఐ లైఫ్‌లో 150 పోస్టుల భర్తీ

జిల్లాలోని నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించేందుకు ఈనెల 20న పాల్వంచ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పనాధికారి కొండపల్లి శ్రీరామ్ తెలిపారు. ఎస్‌బీఐ లైఫ్ ఇన్సూరెన్స్‌లో ఖాళీగా ఉన్న 150 పోస్టుల భర్తీకి ఈ మేళా నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఏదైనా డిగ్రీ పూర్తి చేసి, 18-45 ఏళ్ల వయసున్న వారు అర్హులని వెల్లడించారు. ఎంపికైన వారికి నెలకు రూ.25 వేల వేతనం ఉంటుందన్నారు.
News December 18, 2025
పట్టు రైతులకు రూ.14 కోట్లు విడుదల

AP: రాష్ట్రంలో పట్టు పరిశ్రమపై ఆధారపడిన రైతుల ఆదాయాన్ని పెంచేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. 2023-24, 2024-25 సంవత్సరాలకు సంబంధించి సిల్క్ సమగ్ర-2 పథకంలో భాగంగా రాష్ట్ర వాటా కింద రూ.14 కోట్ల నిధుల్ని పట్టు పరిశ్రమల శాఖకు విడుదల చేశామని మంత్రి వెల్లడించారు. ఈ నిధుల విడుదలతో 13,663 మంది పట్టు రైతులకు లబ్ధి చేకూరినట్లు మంత్రి అచ్చెన్న తెలిపారు.
News December 18, 2025
రేషన్ కార్డుదారులకు అలర్ట్

TG: రేషన్ కార్డు లబ్ధిదారులు ఈ-కేవైసీ తప్పనిసరిగా చేయించుకోవాలని పౌరసరఫరాల శాఖ స్పష్టం చేసింది. ఈ నెల 31లోగా ఈ ప్రక్రియను పూర్తి చేసుకోవాలని సూచించింది. లేదంటే కొత్త సంవత్సరంలో సన్న బియ్యం కోటా నిలిపివేస్తామని ఆదేశాలు జారీ చేసింది. కార్డుల్లో ఉన్న వారు రేషన్ దుకాణాల్లో ఈ-పాస్ యంత్రంలో వేలిముద్రలు వేసి కేవైసీ పూర్తి చేసుకోవాలని చెప్పింది. ఐదేళ్ల లోపు పిల్లలకు దీని నుంచి మినహాయింపు ఇచ్చింది.


