News August 25, 2025
కర్నూలు: DSC-2025 సర్టిఫికేట్ వెరిఫికేషన్ వాయిదా

రేపటి రోజు జరగాల్సిన DSC-2025 సర్టిఫికెట్ వెరిఫికేషన్ వాయిదా వేయడం జరిగిందని రాష్ట్ర విద్యాశాఖ కమిషనర్ ఆదేశాల మేరకు జిల్లా విద్యాశాఖ అధికారి శామ్యూల్ పాల్ ఒక ప్రకటనలో తెలిపారు. తదుపరి వెరిఫికేషన్ తేదీనీ రాష్ట్ర విద్యాశాఖ అనుమతుల మేరకు ప్రకటించడం జరుగుతుందని వెల్లడించారు. డీఎస్సీ అభ్యర్థులు కీలక మార్పును గమనించి సహకరించాలని కోరారు.
Similar News
News August 24, 2025
కర్నూలు: ఒకే ఊరిలో 21 మందికి టీచర్ ఉద్యోగాలు

దేవనకొండ మండలం తెర్నేకల్ గ్రామానికి చెందిన 21 మంది డీఎస్పీ మెరిట్ లిస్టులో అర్హత సాధించారు. వీరిలో 17 మంది ఎస్జీటీ పోస్టులు, ఒకరు పీఈటీ, మరో ముగ్గురు స్కూల్ అసిస్టెంట్లు ఉపాధ్యాయులుగా ఎంపికయ్యారు. వీరిని గ్రామస్థులు అభినందించారు. తమ తల్లిదండ్రులు కష్టపడి చదివించారని, వారి కష్టం వృథా కాలేదని వారు పేర్కొన్నారు.
News August 24, 2025
కర్నూలు: పట్టు విడువని విక్రమార్కుడు ఎం. శివప్రసాద్

జిల్లాలోని పెద్దకడబూరుకు చెందిన శివప్రసాద్ DSCలో పట్టు విడువని విక్రమార్కుడిలా పోరాడాడు. DSC ఎస్జీటీలో 83.43 మార్కులతో టీచర్ పోస్ట్‌లు అర్హత సాధించాడు. గతంలో జరిగిన ప్రతి DSCలో ఒకటి, అర మార్కులతో ఎస్జీటీ పోస్టు చేయి జారినా నిరుత్సాహపడలేదు. 2025 DSC ఇక తనకు చివరిదిగా భావించి రాత్రింబవళ్లు కష్టపడి ఎస్జీటీ పోస్టుకు ఎంపికై తన చిరకాల కలను సాధించాడు.
News August 24, 2025
బీజేపీ రాష్ట్ర కార్యదర్శిగా గీతా మాధురి

బీజేపీ రాష్ట్ర కార్యదర్శిగా కర్నూలుకు చెందిన గీతా మాధురిని నియమిస్తూ రాష్ట్ర అధ్యక్షుడు పీఎన్వీ మాధవ్ ఉత్తర్వులు జారీ చేశారు. గీతా మాధురి పార్టీ అభివృద్ధికి నిరంతరం కృషి చేశారు. గతంలో మహిళా మోర్చా కర్నూలు జిల్లా అధ్యక్షురాలిగా పనిచేశారు. ఫిలిం సెన్సార్ బోర్డు మెంబర్‌గా కూడా పనిచేసిన అనుభవం ఆమెకు ఉంది.