News September 10, 2025
‘కర్నూల్‌లో రూ. 112 కోట్ల బకాయిలను వసూలు చేయాలి’

కర్నూల్ నగరపాలక కార్యాలయంలో బుధవారం కమిషనర్ విశ్వనాథ్ సిబ్బందితో సమావేశం ఏర్పాటు చేశారు. ఆస్తి పన్ను నీటి పన్ను వసూలు చేయడంలో అధికారులు నిర్లక్ష్యం వీడాలన్నారు. పట్టణంలో ఆస్తి పన్ను రూ. 91 కోట్లు, నీటి పన్ను రూ.21 కోట్లు బకాయిలు ఉన్నాయన్నారు. వీటిని వసూలు చేసేందకు అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. గతేడాది 95% తాగునీటి పన్నును వసూలు చేసిన అధికారులను అభినందించారు.
Similar News
News September 10, 2025
దేవనకొండలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు

దేవనకొండ మండలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ రంజిత్ బాషా ఆకస్మికంగా తనిఖీ చేశారు. రోగులకు మెరుగైన వైద్య సేవలను అందించాలని వైద్యులకు కలెక్టర్ సూచించారు. అనంతరం మండలంలోని మన గ్రోమోర్, యూరియా షాపుల్లో సోదాలు చేశారు.ఆయా షాపుల్లో యూరియా పంపిణీ రిజిస్టర్‌ను ఆయన పరిశీలించారు.
News September 10, 2025
కర్నూలులో హత్య.. మరో ఇద్దరి అరెస్ట్

కర్నూలు 1 టౌన్ పీఎస్ పరిధిలో జరిగిన హత్య కేసులో మరో ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. సీఐ పార్థసారథి వివరాల మేరకు.. నిందితులు షేక్ ఇమ్రాన్(37), షేక్ యూసుఫ్(22)ను రాఘవేంద్ర ఘాట్ వద్ద పట్టుకొని, నేరానికి ఉపయోగించిన కత్తిని స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో ఇప్పటికే ముగ్గురు అరెస్టయ్యారు. మొత్తం ఐదుగురు కలిసి షేక్ ఇజహర్ అహ్మద్‌పై దాడి చేసి, హత్య చేసినట్లు వెల్లడైంది.
News September 10, 2025
మద్దతు ధర రూ.10 కోట్లు మంజూరు: కలెక్టర్

అర్లీ ఖరీఫ్‌లో పండించిన ఉల్లి రైతులకు రూ.1,200 మద్దతు ధర చెల్లించేందుకు ప్రభుత్వం రూ.10 కోట్లు మంజూరు చేసిందని కలెక్టర్ పి.రంజిత్ బాషా తెలిపారు. మంగళవారం ఉల్లి కొనుగోళ్ల అంశానికి సంబంధించి కలెక్టర్ అధ్యక్షతన జిల్లాస్థాయి కొనుగోళ్ల కమిటీ సమావేశం టెలి కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించారు. రైతుల నుంచి ఆధార్, బ్యాంకు అకౌంట్ తదితర వివరాలను తీసుకోవాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు.