News October 8, 2025

కర్నూల్‌ యూట్యూబ్‌ ఛానల్‌ను ప్రారంభించిన వైఎస్ జగన్

image

వైసీపీ టాక్స్‌-కర్నూల్‌ యూట్యూబ్‌ ఛానల్‌ను మాజీ సీఎం వైఎస్ జగన్ ప్రారంభించారు. కర్నూలు, నంద్యాల జిల్లాల అధ్యక్షులు ఎస్వీ మోహన్ రెడ్డి, కాటసాని రాంభూపాల్ రెడ్డి ఆధ్వర్యంలో బటన్ నొక్కారు. కూటమి ప్రభుత్వ వైఫల్యాలను సోషల్ మీడియా వేదికగా ఎప్పటికప్పుడు తిప్పికొట్టాలని జగన్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

Similar News

News April 13, 2026

శ్రీశైలంలో రోడ్డు ప్రమాదం.. నలుగురికి గాయాలు

image

శ్రీశైలంలో సోమవారం రాత్రి ఓ కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. తెలంగాణ రాష్ట్రం మెదక్ జిల్లాకు చెందిన కొందరు భక్తులు మల్లన్న దర్శనార్థమై కారులో శ్రీశైలం వచ్చారు. దేవస్థానం టోల్ గేట్ దాటిన తర్వాత కుక్క అడ్డురావడంతో దానిని తప్పించబోయి కారు డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనలో కార్లో ఉన్న ఏడుగురిలో ముగ్గురికి గాయాలు కాగా.. ఓ మహిళకు తీవ్ర గాయాలైనట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News April 13, 2026

9 పరుగులకే సగం మంది ఔట్

image

RRతో మ్యాచులో SRH బౌలర్లు నిప్పులు చెరుగుతున్నారు. 3 ఓవర్లలో 9 పరుగులే ఇచ్చి 5 వికెట్లు పడగొట్టారు. ప్రఫుల్ హింగే 4, సాకిబ్ హుస్సేన్ ఒక వికెట్ తీశారు. వైభవ్, జురెల్, ప్రెటోరియస్ డకౌట్ అయ్యారు. జైస్వాల్ (1), పరాగ్ (4) కూడా ఫెయిల్ అయ్యారు. ప్రస్తుతం రాజస్థాన్ స్కోర్ 3.3 ఓవర్లలో 11/5గా ఉంది. విజయానికి మరో 206 రన్స్ కావాలి.

News April 13, 2026

ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి: కలెక్టర్

image

కొండపాక మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ కార్యాలయంలో సోమవారం ‘ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక’లో భాగంగా ‘అరైవ్-అలైవ్’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కె. హైమావతి మాట్లాడుతూ, ప్రతి వాహనదారుడు క్షేమంగా తమ గమ్యస్థానాలకు చేరుకోవాలని, అందుకు రోడ్డు భద్రతా నియమాలను విధిగా పాటించాలని పిలుపునిచ్చారు. ప్రయాణాల్లో అప్రమత్తంగా ఉండి ప్రమాదాలను నివారించాలని ఆమె ప్రజలకు సూచించారు.