News June 29, 2024

కర్నూల్ TO తిరుపతి, విజయవాడకు సర్వీసులు ఎప్పుడో?

image

ఉయ్యాలవాడ నరసింహారెడ్డి (ఓర్వకల్లు) విమానాశ్రయం నుంచి ప్రయాణికుల రాకపోకల సంఖ్య పెరుగుతోంది. మూడేళ్ల కాలంలో 1,20,732 మంది ప్రయాణం చేశారు. వైజాగ్, చెన్నై నగరాలకు తక్కువ సమయంలోనే చేరుకోగలుగుతున్నారు. అయితే ఈ ఎయిర్ పోర్టు నుంచి విజయవాడ, తిరుపతి నగరాలకూ విమానాలు తిప్పాలని ప్రయాణికులు కోరుతున్నారు. మన రాష్ట్ర ఎంపీ రామ్మోహన్ నాయుడే కేంద్ర విమానయానశాఖ మంత్రి కావడంతో దీనిపై దృష్టి సారించాలని కోరుతున్నారు.

Similar News

News July 8, 2024

శ్రీశైలంలో ఉద్యోగుల విధుల్లో మార్పులు

image

పరిపాలన సౌలభ్యంలో భాగంగా శ్రీశైలం దేవస్థానంలో వివిధ కీలక విభాగాల్లో పనిచేస్తున్న ఉద్యోగుల స్థానాలను మారుస్తూ ఈవో పెద్దిరాజు సోమవారం ఆదేశాలు జారీ చేశారు. అందులో భాగంగా ఆలయంలోని పలు విభాగాల్లో పనిచేస్తున్న 50మంది రెగ్యులర్, కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఉద్యోగుల అంతర్గత బదిలీలు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. ఈవో పెద్దిరాజు మాట్లాడుతూ.. ఎవరికి కేటాయించిన స్థానాల్లో వారు విధులు పకడ్బందీగా నిర్వహించాలన్నారు.

News July 8, 2024

ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారులు కృషి చేయాలి: కలెక్టర్

image

ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారులు తగిన ప్రాధాన్యతనిస్తూ ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి తెలిపారు. నంద్యాల జిల్లా కార్యాలయంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పలు ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు తమ సమస్యలను జిల్లా కలెక్టర్‌కు అర్జీల రూపంలో అందించారు. సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని కలెక్టర్ తెలిపారు.

News July 8, 2024

పాప ఆచూకీ తెలిసినవారు మాకు తెలియజేయండి : ఎస్ఐ జయశేఖర్

image

ఎనిమిదేళ్ల చిన్నారి అదృశ్యమైన ఘటన ఆదివారం జరిగింది. ఎస్సై జయశేఖర్ వివరాలు..పగిడ్యాల మండలం ముచ్చుమర్రి గ్రామానికి చెందిన 8ఏళ్ల చిన్నారి వాసంతి ఆదివారం మధ్యాహ్నం ఆడుకోవడానికి బయటికి వెళ్లింది. రాత్రి అయినా ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు ముచ్చుమర్రి పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఆయన కేసు నమోదు చేసుకొని పాప కోసం గాలిస్తున్నారు. పాప ఆచూకీ తెలిసినవారు పోలీసుస్టేషన్‌ను సంప్రదించాలని కోరారు.