News March 5, 2025

క‌ర్మ‌యోగి పోర్ట‌ల్ ద్వారా ఆన్‌లైన్ శిక్ష‌ణ పూర్తిచేసుకోవాలి: కలెక్టర్

image

జిల్లాలోని ప్ర‌భుత్వ ఉద్యోగులంతా మార్చి 16వ తేదీలోగా ఐగాట్ క‌ర్మ‌యోగి పోర్ట‌ల్ ద్వారా త‌ప్ప‌నిస‌రిగా ఆన్‌లైన్ శిక్ష‌ణ పూర్తిచేసుకోవాల‌ని క‌లెక్ట‌ర్ డా.బీఆర్‌‌ అంబేడ్కర్ ఆదేశించారు. ప్ర‌భుత్వ ఉద్యోగుల శ‌క్తి సామ‌ర్ధ్యాల‌ను పెంచ‌డానికి కేంద్ర ప్ర‌భుత్వ స‌హ‌కారంతో రాష్ట్ర ప్ర‌భుత్వం ఈ ఆన్‌లైన్ శిక్ష‌ణ కార్య‌క్ర‌మాన్ని చేప‌ట్టింద‌న్నారు.

Similar News

News March 6, 2025

అవసరమైతే పోలీసులను వినియోగించుకుంటాం: కలెక్టర్

image

జిల్లాలో బాల కార్మిక వ్య‌వ‌స్థ‌ను పూర్తిగా నిర్మూలించాల్సిన అవ‌స‌రం ఉంద‌ని క‌లెక్ట‌ర్ అంబేద్కర్ అన్నారు. వెట్టి చాకిరీ, మాన‌వ అక్ర‌మ ర‌వాణాల‌పై ముద్రించిన పోస్ట‌ర్ల‌ను తన ఛాంబర్‌లో బుధవారం ఆవిష్క‌రించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. బాల కార్మికుల‌ను గుర్తించేందుకు వివిధ శాఖ‌లు సంయుక్తంగా స్పెష‌ల్ డ్రైవ్ నిర్వ‌హించాల‌ని ఆదేశించారు. అవ‌స‌ర‌మైతే దీనికోసం పోలీసులను కూడా వినియోగించుకుంటామ‌న్నారు.

News March 6, 2025

VZM: మాజీ ఎమ్మెల్యే సతీమణి కన్నుమూత

image

అప్పటి సతివాడ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే దివంగత పొట్నూరు సూర్యనారాయణ సతీమణి కనకమ్మ బుధవారం కన్నుముశారు. ఆమె గడిచిన కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. పరిస్థితి విషమించడంతో తుది శ్వాస విడిచారు. ప్రస్తుతం ఆమె పాలవలస సర్పంచ్‌గా కొనసాగుతున్నారు. ప్రజల సందర్శనార్థం పార్ధివదేహాన్ని పాలవలసలోని తన నివాసంలో అందుబాటులో ఉంచారు. గురువారం ఉదయం అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

News March 6, 2025

ఆ రూ.12 కోట్ల వసూలు చేయండి: VZM కలెక్టర్

image

లేబ‌ర్ సెస్ వ‌సూలుపై దృష్టి పెట్టాల‌ని కలెక్టర్ అంబేడ్క‌ర్ ఆదేశించారు. కలెక్టరేట్లోని ఆ శాఖ అధికారులతో బుధవారం సమీక్ష జరిపారు. మొత్తం నాలుగు విభాగాల్లో ఒక్క విజిలెన్స్ అల‌ర్ట్ క్రింద సుమారు రూ.12 కోట్లు వ‌ర‌కు బ‌కాయి ఉంద‌ని చెప్పారు. వీలైనంత త్వ‌ర‌గా దీనిని వ‌సూలు చేయ‌డమే కాకుండా, పెండింగ్‌లో ఉన్న సుమారు 1300 క్లైయిముల‌ను వెంట‌నే ప‌రిష్క‌రించాల‌ని కలెక్టర్ ఆదేశించారు.

error: Content is protected !!